క్రైమ్/లీగల్

బంగారంతో ‘బురిడీ’ బాబా మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 2 : వాస్తు దోషం వల్లే మీ కొడుకు పెళ్లి కావట్లేదు ..పూజలు చేస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయని నమ్మించి పదకొండున్నర తులాల బంగారంతో ఉడాయంచాడు ఓ దొంగబాబా. ఘటన జిల్లా కేంద్రమైన జగిత్యాలలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని బుక్కవాడలో భూస రాధ - గంగాధ ర్ దంపతులు నివసిస్తున్నారు. వారి ఇంటికి గుర్తు తెలియని ఓ బాబా సోమవారం ఉద యం 10 గంటల సమయంలో వచ్చాడు. మీ ఇంటికి వాస్తు దోషం ఉంది.. గ్రహచారం మంచిగా లేదంటూ మాయమాటలు చెప్పి రాధను నమ్మించాడు. పూజలు చేస్తే నీ కొడుకు పెళ్లి జరుగుతుందని నమ్మించాడు. దీంతో ఇంట్లో పూజలు చేశా డు. ప్రత్యేకంగా బాక్స్‌లో బియ్యం పోసి బంగారం పెట్టాలని సూచించాడు. బాబా మాటలు నమ్మిన రాధ రెండు తులాల పుస్తెల తాడు, 8 తులాల లాంగ్ చైన్, ఓ తులం కమ్మలు, అర తులం బంగారు వేసింది. అనంతరం బాక్స్‌కు ధారాలు చుట్టి పూజలు చేశాడు. సాయంత్రం తరువాత స్నానం చేసిన అనంతరం దేవుడి దగ్గర బాక్స్ విప్పితే మీ గ్రహచారం బాగుంటుందని నమ్మించాడు. కానీ అంత కు ముందే బురుడీ బాబా చాకచక్యంగా ఆ బాక్స్‌ను మార్చి అదేవిధంగా ఉన్న మరో బాక్స్ పెట్టితో ఉడాయించాడు. బాబా చెప్పిన మాట పూర్తిగా నమ్మిన రాధ సాయంత్రం ఆ బాక్స్‌ను తెరిచి చూడగా ఉన్న బంగారం కనిపించకపోవడంతో లబోదిబోమంటూ మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకూని పూర్తి వివరాలు సేకరించారు. బాబా కోసం గాలింపు చర్య లు చేపట్టి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల పోలీసులు వెల్లడించారు. ఇలాంటివి చాలా జరుగుతున్నా ...జనాల్లో ఇంకా చైతన్యం రావడం లేదు.