కరీంనగర్

టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 11: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి ఆశీర్వదించాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కోరారు. గురువారం ఉదయం నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఉదయపు నడక చేపట్టారు. పలువురు స్ధానికులు, స్నేహితులు, అభిమానులతో కలిసి కాసేపు వర్తమాన రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ తెలంగాణ ఉద్యమకారునిగా కరీంనగర్ వాసులు ఆదరించి, అసెంబ్లీకి పంపుతారంటూ పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగా అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌కే ఓటేసి, రజకార్లకే కొత్త భాష్యం చెబుతున్న టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో పొన్నంతోపాటు మాజీ మేయర్ డీ. శంకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రకాష్, నాయకులు జక్కని ఉమాపతి, చాడగొండ బుచ్చిరెడ్డి, మాచర్ల ప్రసాద్, వేదం, పడిశెట్టి భూమయ్య, మీస బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓటు అడిగే నైతికహక్కు కాంగ్రెస్ వారికి లేదు
- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానకొండూర్, అక్టోబర్ 11: కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కులేదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. గురువారం మండల పరిధిలోని లింగాపూర్‌లో గ్రామంలోమానకొండూర్ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రసమయి బాలకిషన్ ఇంటింట తిరుగుతూ జోరుగా ప్రచారం చెపట్టారు. ముందుగా రసమయి బాలకిషన్‌కు గ్రామంలోని మహిళలు కోలాటలు, డప్పుచప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన దుబాయ్ ఏజేంట్ పోల్సాని మురళిధరావు, కోఖేందర్‌రావు, మాజీ సర్పంచ్ ఎరుకల తిరుపతి, రామరావుతోపాటు 50 మంది కాంగ్రెస్‌లో నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి రసమయి బాలకిషన్ సమక్షంలో చేరిన్నారు. వివిధ పార్టీలో నుండి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు రసమయి పార్టీ కండువ కప్పి అహ్వానించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధియే లక్ష్యంగా కేసిఆర్ పని చేసిన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం కేసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ నాలుగెళ్లన్నర కాలంలో చేసిన అభివృద్ధికి పలువురు ఆకర్షితులై టీఆర్‌ఎస్ పార్టీలో గ్రామగ్రామాన చేరుతున్నారని తెలిపారు. రాభోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు అదరించి మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని రసమయి బాలకిషన్ కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావు, వైఎస్‌ఎంపిపి దేవ సతీష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్, ఎంపిటీసి మాదాసు మమత-సంతోష్, గ్రామాశాఖ అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్, పారునంది కిషన్, రుద్రవరం సాయికుమర్, మల్లగల్ల నగేష్, ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు గాలిపల్లి వసంత, కొరిమి పితాంబర్, విరేషం, అంబేద్కర్ సంఘం సభ్యలు తదితరులు పాల్గొన్నారు.