కరీంనగర్

ఓటమిపై భయంతోనే గంగుల విచక్షణారహిత వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎన్నికల్లో డిపాజిట్ దక్కనిదెవరికోప్రజలు నిర్ణయిస్తారు
* రాజకీయ ఆరోపణలు ప్రజాస్వామ్యంలో భాగమే
* వ్యక్తిగత విమర్శలు చేస్తే చరిత్ర హీనులవుతారు
* సెగ్మెంట్‌లో అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధమేనా?
* బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ సవాల్
=======================================
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 12: తమ పార్టీ అగ్రనేత అమిత్‌షా పర్యటనతో, ఓటమి తథ్యమనే భయంతోనే మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విచక్షణ కోల్పోయి, వ్యాఖ్యలు చేస్తున్నాడని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ ఆరోపణలు చేయటం సహజమేనని, తాను మాజీ ఎమ్మెల్యే గంగులపై ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలకు దిగలేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చేసిన అవినీతి, అక్రమాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక పరుష పదజాలం ఉపయోగించటం ఆయన విచక్షణకే వదిలేస్తున్నట్లుప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ దక్కనిదెవరికో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. కరీంనగర్ ప్రజలకు ఎమ్మెల్యేగా రెండు సార్లు సేవలందించిన నేపథ్యంలోనే సమస్యలపై గొంతెత్తామన్నారు. గతంలో పత్రికలు, ఛానళ్ళలో వచ్చిన ఆరోపణలే తాను ఉటంకిస్తే, ఉలికిపడటమెందుకని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డు భూ ఆక్రమణలపై, గ్రానైట్ క్వారీల అక్రమాలు, గుట్కా మాఫియా, ఇసుక క్వారీలపై వస్తున్న విమర్శలు వాస్తవం కాదా అని అన్నారు. బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి వ్యక్తికి రూ.15లక్షలు ఇస్తానని ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రకటన చేయలేదని, తప్పుడు ఆరోపణలు చేస్తూ కించపరిస్తే ఫలితం అనుభవించక తప్పదన్నారు. వ్యక్తిగత సమస్యలపై విమర్శించటం తమ నైజం కాదని, సామాజిక సమస్యల పరిష్కారం కోసం తాము, తమ పార్టీ నిరంతరం ఉద్యమిస్తోందన్నారు. రామమందిరంపై బీజేపి మాట తప్పలేదని, అసలు రామమందిర నిర్మాణంపై గంగుల అభిప్రాయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. విష జ్వరాల ప్రభావంతో నగరంలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోకుండా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరందిస్తామంటూ చేసిన ప్రకటన ఏమైందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణంలో ఏస్థానంలో ఉన్నామో వివరించాలని, ఎంతమంది గుర్తించి, ఎంతమందిని ఎంపికచేశారోతెలపాలని డిమాండ్ చేశారు. నోరు లేని మూగజీవాలను హింసించే నీచపుబుద్ధి తమది కాదని, యంత్రపు బోటు కూడా భరించలేని స్థితిలో నీటిలోకి నెట్టేసిందని ఎద్దేవా చేశారు. ఒక్క సభతోనే ఇంతగా భయపడితే, రాబోయే రోజుల్లో మరెన్నో సభలను బీజేపి నిర్వహించనుందని, రామరాజ్యం కోరుకుంటున్న తమను బద్‌నామ్ చేస్తే చూస్తూ ఊర్కునేది లేదని స్పష్టం చేశారు. సెగ్మెంట్‌లో అభివృద్ధి, అవినీతిపై చర్చించేందుకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. రజాకర్ల వారసుల పార్టీ ఎంఐఎంతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని మరోసారి దోచుకునేయత్నం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. రజాకార్ల వారసత్వంతో ఆవిర్భవించిన ఎంఐఎం పార్టీ పాతబస్తీని అభివృద్ధికి నోచుకోకుండా చేస్తుందని మండిపడ్డారు. అనేక మంది ముస్లీం యువకుల జీవితాలతోచెలగాటమాడుతూ, తమ ఆస్థులు కాపాడుకునేందుకు ఓవైసీ సోదరులు యత్నిస్తున్నారని దుమ్మెత్తారు. ఈసమావేశంలోబీజేపీ నాయకులు బాస సత్యనారాయణరావు, శివరామకృష్ణ, బేతి మహేందర్‌రెడ్డి, గంటల రమణారెడ్డి, ఎన్నం ప్రకాశ్, గాజే రమేశ్, బండ అనిత, హరికుమార్‌గౌడ్, పి.సుజాత, ఉప్పు రవీందర్, బోయినపల్లి ప్రవీన్‌రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.