కరీంనగర్

గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, అక్టోబర్ 16: ప్రాణాలను హరించి వేసే గంజాయి అమ్మకాలు జరిపితే విడిచి పెట్టేది లేదు... ‘గంజాయి’ విక్రయదారులపై ఉక్కుపాదం తప్పదని రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రాంతాల్లోని ఠాణాల పరిధిలో జరుగుతున్న గంజాయి విక్రయాలపై చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 12 మంది గంజాయి విక్రయదారులు... 139 మంది గంజాయి సేవించే యువకులు పోలీసులకు చిక్కారు. మంగళవారం కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సత్యనారాయణ గంజాయి విక్రయదారుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో మంచిర్యాలకు జిల్లాకు చెందిన అంగోతు రాము, అలిమేకర్ శ్యాం, ఎండి.రసూల్, బూక్య పద్మ, షేక్ సమ్రిత్, కుషనపల్లి అరుణ్ కుమార్, ముల్కాల శివ, బూక్య నరేష్, అబ్దుల్ సాజిద్, ఆత్రం సోము, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియాకు చెందిన కామెర్ల శ్యాం, నలిమెల వినోద్ ఉన్నట్లు సిపి తెలిపారు. యువకులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లలు, ఉద్యోగులు తాత్కలిక సంతోషాల కోసం గంజాయికి బానిసలవుతున్నారని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైతే దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు సైతం తెగపడుతారని అన్నారు. కమీషనరేట్ పరిధిలో 3వేల మంది యువకులు గంజాయికి బానిసైన్నట్లు తెలిసిందని చెప్పారు. దీన్ని పూర్తిగా నివారిస్తామన్నారు. గోదావరిఖని సిక్ ఆసుపత్రి ఏరియాను గంజాయి విక్రయదారులు మరో ధూల్‌పేటగా ప్రచారం చేసుకుంటున్నారని, అయితే దీన్ని సమూలంగా అణిచివేస్తామని చెప్పారు.
యువకులకు కౌనె్సలింగ్
గంజాయి సేవించే యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో పోలీస్ కమీషనర్ సత్యనారాయణ ప్రత్యేకంగా కౌనె్సలింగ్ ఇచ్చారు. స్మోకర్స్‌లో 12 సంవత్సరాల యువకులు ఉండటం విశేషం. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం మూలంగా చిన్నతనంలో యువకులు మత్తుకు బానిసవుతుంటే మీరు... బాధ్యతను విస్మరించడం సరైంది కాదంటూ సీపీ తల్లిదండ్రులకు సూచించారు.
ఎసిపి రక్షిత కె మూర్తి ఆధ్వర్యంలో రామగుండం కమీషనరేట్ పరిధిలో గంజాయి విక్రయాల నిర్మూలనకు యాంటి గాంజ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేసిన్నట్లు సిపి తెలిపారు. కమీషనరేట్ పరిధిలో నాలుగు బృందాలను నియమించిన్నట్లు పేర్కొన్నారు.

ట్రాఫిక్ విభాగంలో పారదర్శకతకై..
నగదు రహితం
- రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
గోదావరిఖని, అక్టోబర్ 16: ఇకపై బలవంతంగా వాహనాలను ఆపడం... ఈ క్రమంలో వాహనాదారులతో వాగ్వివాదాలు జరగడం అంతా కూడా ఉండదు... ట్రాఫిక్ విభాగంలో పూర్తిగా పారదర్శకతకై నగదు రహిత (క్యాష్ లెస్) విధానాన్ని అమలు పరుస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రామగుండం కమీషనరేట్ కార్యాలయంలో సిపి సత్యనారాయణ ఈ-్ఛలాన్ యాప్‌ను ప్రారంభించారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ-్ఛలాన్ విధానం హైదరాబాద్‌లో ప్రారంభం కాగా మూడవది రామగుండం కమీషనరేట్‌లో మనం ప్రారంభించుకుంటున్నట్లు చెప్పారు. వాహనాల తనిఖీ సందర్భంగా ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు లేవని వాహనాదారులతో పోలీసులకు మధ్య ఎదురవుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ క్రమంలోనే కొంత అవినీతికి అవకాశాలు కూడా లేకపోలేదని, అయితే ఈ విధానం వల్ల ఇది పూర్తిగా అరికట్టవచ్చని సిపి చెప్పుకచ్చారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, దీనిలో ఎవరికి మినహాయింపు లేదని, చివరికి పోలీసులు కూడా హెల్మెట్లు వాడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కుటుంబ ప్రయోజనాలే కేసీఆర్ ధ్యేయం
-కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి
ధర్మపురి, అక్టోబర్ 16: ప్రజల ఆకాంక్షలను గాలి కొదిలి స్వార్థమే పరమార్థంగా, కుటుంబ ప్రయోజనాలే ధ్యేయంగా మారిన కేసిఆర్ నేతృత్వంలోని తెరాసకు ఓట్లడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర వరిష్ట కాంగ్రెస్ నేత, తాజామాజీ సీఎల్పీ ఉపనేత తాడిపర్తి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ధర్మపురి క్షేత్రంలో నిర్వహించిన వందలాది యువత కాంగ్రెస్‌లో చేరికల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కోరుట్ల, చొప్పదండి, లక్సెట్టిపేట, హుస్నాబాద్, ఇంకా ఎన్నో సెగ్మెంట్లలో తాజామాజీలు వెళితే తరిమి కొట్టడాలను బట్టి, తెరాస పాలనపై ప్రజలకున్న ఆగ్రహం వ్యక్తం అవుతున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రం 60వేల కోట్ల అప్పులతో ఉండగా, నేడు 2లక్షల 20వేల కోట్ల అప్పులు చేశారని, ఆంధ్రా కంట్రాక్టర్లకు కమీషన్లకు కుక్కుర్తి పడి, తెలంగాణ సొమ్మును వారికి దోచి పెట్టారన్నారు. నాడు తమ ప్రభుత్వాలు ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తే, డబుల్‌రూంల పేరుమీద ఎన్ని కట్టించారో, ప్రారంభించారో ప్రజలకు తెలుసన్నారు. కూటమి ఐక్య పోరాటానికి కారణం కేసిఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు. లక్ష్మణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ, స్థానికులైన వందలాది యువకులు పార్టీలో చేరగా, జీవన్‌రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.