కరీంనగర్

ప్రాజెక్టులను అడ్డుకుంటే రక్తపాతమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 3: ప్రజల ఆకాంక్షతోపాటు క్షేత్రస్థాయి అవగాహన ఉన్న సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సముద్రం పాలవుతున్న గోదావరి నది జలాలను కేటాయింపుల మేరకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడటం సరికాదని, ఒకవేళ అలా చేస్తే మాత్రం ప్రభుత్వం రక్తపాతం సృష్టించైనా ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందిస్తుందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మేలు కోసం చేపడుతున్న ప్రాజెక్టులను మానవీయ కోణంలో ఆలోచించే ఏ నాయకుడైనా హర్షిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆంధ్ర కేబినెట్‌లో ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయాలని తీర్మానం చేయడం ఆయన కుటిల నీతికి నిదర్శనమని అన్నారు. కేటాయింపుల ప్రకారమే జలాలను వాడుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీలో బ్యారేజీలు నిర్మిస్తున్న సమయంలో ఆ నిర్మాణాలతో తెలంగాణ ఎడారి అవుతుందని ఒక ప్రత్యేక సంచికనే ముద్రించి పంపిణీ చేసిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు అదే తెలంగాణను ఏడారిగా మార్చాలనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. జాతీయ పార్టీగా చెప్పుకునే టిడిపి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉండగా, కేవలం ఆయన రాష్ట్రం గురించే మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం ధ్వంద వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలను మానుకోవాలని లేనిపక్షంలో ప్రజల చేతిలో పరాభవం తప్పదని ఈద శంకర్‌రెడ్డి అన్నారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ మంథని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడంతోపాటు హరిత తెలంగాణ మార్చాలని ఆలోచనతో సిం కెసిఆర్ గోదావరి జలాలను వాడుకునేందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలను నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రజల పక్షాన సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై చంద్రబాబు కేబినెట్‌లో తీర్మానం చేయడం సరికాదని, ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన ప్రాంతం గురించి బాబు ఆలోచిస్తున్నప్పుడు మీ ప్రాంతం గురించి మీరు ఆలోచిస్తారా లేదా నిర్ణయించుకోవాలని రమణకు సూచించారు. లేనిపక్షంలో ప్రజలు క్షమించరని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు జి.వి.రామకృష్ణారావు, అక్బర్ హుస్సేన్, భాస్కర్ నాయక్, జంగపల్లి కుమార్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.