కరీంనగర్

ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 12: జూన్ 2 నుండి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆవిర్భావ వేడుకలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించనున్నట్లు తెలిపారు. కవి సమ్మేళనాలు, సెమినార్‌లు, వర్క్‌షాపులు, ఛాయాచిత్ర ప్రదర్శనలు, హస్తకళా ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ నేపథ్య చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్గనైజింగ్, క్రీడలు, సాంస్కృతిక, ప్రోటోకాల్, పోటీలు, పబ్లిసిటీ, సావనీర్, కవి సమ్మేళనం నిర్వహణ, జిల్లా స్థాయి అవార్డుల ఎంపిక, కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ రంగాలలో ఎవరైనా అధికారులకు అభిరుచి ఉండి కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములు కావాలనుకొంటే వారికి ఈ కమిటీలో భాగస్వాములను చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల కల్పన, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటి సంరక్షణ లాంటి పథకాల అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు, సంస్థలకు, వ్యక్తులకు ప్రశంసాపత్రాలను ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ భాస్కర్, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్య, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నాగేంద్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.