కరీంనగర్

రామగుండం కార్పొరేషన్‌లో ‘డబుల్’ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, మే 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరికి గృహ వసతి కల్పించాలన్న మహా సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూంల ఎంపిక విధానం అంతా అధికార పక్షానికి అనుకూలంగా జరుగుతోందన్న అపవాదు గుప్పుమంది. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర గంధరగోళం చెలరేగింది. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కమీషనర్ జాన్ శ్యాంసన్, తహశీల్దార్ గుడూరి శ్రీనివాస రావు సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించిన లబ్ధిదారుల ఎంపిక డ్రా పద్ధతికి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపి కార్పొరేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సర్వేలో అవకతవకలు జరిగాయని, కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో లబ్ధిదారుల ఎంపిక కోసం రెవెన్యూ యంత్రాంగం చేపట్టిన సర్వే అంతా కూడా పూర్తిగా ఏకపక్షంగా... తప్పుల తడకగా కొనసాగిందంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆందోళనకు దిగి డ్రా పద్ధతిని అడ్డుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లకు 160 ఇండ్లు మంజూరు కాగా వీటికి 10,752 అప్లికేషన్లు వచ్చాయి. 25, 33, 40, 41, 50 డివిజన్లలో ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు కాక పోవడం, ఎస్టీలు అధికంగా ఉన్న 50, 39 డివిజన్లలో ఎంపిక సక్రమంగా జరగకపోవడం ఆరోపణలకు కారణమవుతుంది. వీటిని రామగుండం రెవెన్యూ అధికారులు ఆయా డివిజన్లలో విస్తృతంగా సర్వే జరిపి 430 మంది లబ్ధిదారులను అర్హులుగా ఎంపిక చేశారు. 430 మంది లబ్ధిదారుల నుంచి 160 మందిని ఎంపిక చేసేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో డ్రా పద్ధతిని చేపట్టగా అర్హులుగా రూపొందించిన జాబితా సరైంది కాదని, 430 మందిలో ఎక్కువ శాతం ఇండ్లు ఉన్న వారు, ఉద్యోగస్థులు, అనర్హులు ఉన్నారని, అసలైన ఇండ్లు లేని పూర్తి స్థాయి నిరుపేదలను ఆ జాబితాలో చేర్చకపోవడం పూర్తిగా ఏకపక్షమని, చేర్చి ఉంటే డ్రాలో వచ్చునో... రాకపోవునో... తేలిపోయి ఉండేదని, అలా కాకుండా అసలైన నిరుపేదలకు సర్వే ద్వారా తప్పుడు నివేదికలు చూపించి అన్యాయం చేశారంటూ కాంగ్రెస్, బిజెపి కార్పొరేటర్లు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. డివిజన్ల వారిగా డ్రా పద్ధతిని చేపట్టాలని, 160 ఇండ్లు కాకుండా కార్పొరేషన్‌లో ఇంకా పెంచాలని, ఇప్పుడు ఏకపక్షంగా డ్రా తీసిన వ్యవహారాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్‌లో డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో చోటు చేసుకున్న ఆందోళన పరిణామాలతో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఇది ఇలా ఉండగా కార్పొరేషన్ ఏరియాలో ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం డబుల్ బెడ్ రూంకు సంబంధించి ఎంపికపై డ్రా పద్ధతిని చేపట్టామని, సర్వే అంతా కూడా పూర్తి స్థాయి పారదర్శకంగా జరిగిందని తహశీల్దార్ శ్రీనివాస రావు వివరించారు. కాగా అధికార పక్షానికి చెందిన కార్పొరేటర్లకే ఎక్కువగా ఇండ్ల కేటాయింపు జరిగిందని, ప్రతిపక్షంలోని కార్పొరేటర్లు ఆరోపిస్తుండగా... అధికార పక్షానికి మద్ధతుగా ఉన్న కార్పొరేటర్లు మాకు సైతం డబుల్ ఇండ్లలో అన్యాయం జరిగిందని, సర్వే అంతా కూడా ఇష్టానుసారంగా జరిగిందని ఆరోపణలు గుప్పించడం గమనార్హం.