కరీంనగర్

చేనేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 22: చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారిని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం నగరంలోని పోచమ్మ గుడి వద్ద సుమారు ఆరు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పద్మశాలీ సామాజిక భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులతో భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని తెలిపారు. నేత, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగాలని, ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, వారికి అండగా నిలుస్తుందని మరోమారు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని తెలిపారు. జిల్లాలో అన్ని కుల సంఘాలకు సామాజిక భవనాలు నిర్మిస్తామని అన్నారు. సామాజిక భవనాలు ఆయా కులాల పేద విద్యార్థులు చదువుకునేందుకు దోహదపడతాయని అన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం వెయి రూపాయల పింఛన్ ఇచ్చి ఆదుకుంటుందని తెలిపారు. సమైక్యపాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేవారు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన నిధులు మనమే ఖర్చు చేస్తున్నామని, ఎన్ని కోట్లయినా ఖర్చు చేసి పనులు కొనసాగిస్తామని రాజేందర్ స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపి బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ మనుషులకు తిండికంటే బట్టలు అవసరమని, బట్టలు లేకుండా మనుషులు బతకలేరని, మనుషులకు బట్టలను అందించే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకూడదని కోరారు. నూతన ఒరవడిలోవ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వస్తప్రరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. బాంబేలో వస్త్ర కంపెనీలతో చర్చించి బట్టల తయారీలో వారి సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్, ఎంపిపి వాసాల రమేష్, స్థానిక కార్పొరేటర్ కట్ల విద్యతో పాటు పలువురు పాల్గొన్నారు.