కరీంనగర్

వాస్తవ నీటి లభ్యత ఆధారంగా సాగునీటి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్: జిల్లాలో వాస్తవంగా లభించే నీటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా సాగునీటి ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా సాగునీటి ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కరవు మండలాలను, అధిక నీటి లభ్యత ఉన్న మండలాలను దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాలకు సాగునీరు లభ్యమయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమీక్షించిన అనంతరం పూర్తి నివేదిక తయారు చేయాలని, లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించి నిధులు లభ్యమయ్యే విధంగా ప్రణాళికలుండాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న సిరిసిల్ల, హుస్నాబాద్ మండలాల్లో పర్క్యులేషన్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతామని, ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టు కింద రీజనరేటర్ వాటర్ ఉపయోగించుకోవడానికి చెక్‌డ్యాం నిర్మాణాలు చేపట్టేవిధంగా ప్రణాళికలో పొందుపర్చాలని పేర్కొన్నారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో టెయిలెండ్ గ్రామాలకు నీరు అందేవిధంగా చూడాలని చెప్పారు. పట్టణాల్లో మురికినీటిని శుద్ధిచేసి పొలాలకు ఉపయోగించే విధంగా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాన్‌లలో నెలకొల్పాలని సూచించారు. బోర్ల రీచార్జికి నివేదికలో పొందుపర్చినట్లైతే అధిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులతో సంప్రదించి రెండు రోజుల్లో పూర్తి నివేదికను రూపొందిస్తామన్నారు. ప్రణాళిక పూర్తయ్యేనాటికి ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూరె్తై జిల్లా మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల కింద సాగువిస్తీర్ణం 4,00,378 నుంచి 5,80,140 హెక్టార్లకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కింద 55,225 హెక్టార్లు, బావుల ద్వారా సాగు 21,982 హెక్టార్లు, పర్కులేషన్ ట్యాంకుల కింద 24,408 హెక్టార్లు, ఎం.ఐ ట్యాంకుల కింద 49,562 హెక్టార్లు సాగులోకి వస్తుందని వివరించారు. జిల్లా నీటి ప్రణాళికను ఐదేళ్లకుగాను రూ.13,866 కోట్లతో ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అసివిరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం కింద రూ.11,367కోట్లు, హర్‌కేత్‌కో పాని కింద రూ.1,462కోట్లు, పర్‌డ్రాప్‌మోర్‌క్రాప్ కింద రూ.826కోట్లు, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కింద రూ.211కోట్లు అంచనాలు రూపొందించినట్లు వివరించారు. సుమధుర ఏజన్నీ సంస్థ ఎస్‌వి గోవర్దన్‌దాస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్యేలు తాటిపర్తి జీవన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, బొడిగె శోభ, గంగుల కమలాకర్, డిఆర్‌వో టి వీరబ్రహ్మయ్య, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటకృష్ణ, డ్వామా పిడి గణేశ్, హౌసింగ్ పిడి నర్సింహారావు, సిపివో సుబ్బారావులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

చట్టాల పట్ల మహిళలకు అవగాహన ఉండాలి
* ఆర్థిక సాధికారితతోనే సామాజిక, రాజకీయ సాధికారత
* రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 11: మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా సోషల్ ఆక్షన్ కమిటి సభ్యులకు రెండు రోజులు మహిళా చట్టాలపై అవగాహన-శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో మనుషుల ఆలోచన తీరు మారాలని, అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూసే ధోరణి మారాలని అన్నారు. తల్లిదండ్రుల పెంపకంలో సమాజంలో పిల్లలు ఎవరితో ఏ విధంగా మెలుగాలి అనే శిక్షణ తప్పనిసరిగా ఉండాలని, చిన్నప్పటి నుండి వారికి ఇవ్వాల్సిన స్వాతంత్య్రం వారికి ఇస్తూనే సమాజంలో పరిమితుల గురించి తెలియజెప్పే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. 2011-12 సంవత్సర కాలం వరకు మహిళలు వంటింటికే పరిమితం కాదని, మహిళల సాధికారత కోసం ఎంతో కృషి జరిగిందని, రాను రాను ఇపుడు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై పోరాటాలు చేయాల్సి వస్తోందని తెలిపారు. మహిళల సాధికారతలో మొదట ఆర్థిక సాధికారత పొందిననాడే సామాజిక, రాజకీయ సాధికారత వస్తాయన్నారు. నేడు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు పొంది 50 శాతం మహిళలు ప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నప్పటికీ చాలా చోట్ల మహిళలకు బదులు వారి భర్తలు అధికారం చెలాయిస్తున్నారన్నారు. ఈ దోరణిలో మార్పు రావాలని, మహిళలే పరిపాలన చేసేవిధంగా చర్యలు చేపట్టాలని, మహిళలు అధికారంలో ఉన్నప్పుడే మహిళల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎన్ని చట్టాలు చేసినా నేడు బాల్య వివాహాలు, జోగిని దురాచారాలు బయటపడుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పుకు మహిళల్లో పెద్దఎత్తున చైతన్యంతో పాటు వారి రక్షణ సాధికారత కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాల పట్ల పూర్తిగా అవగాహన కలిగేలా మహిళా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు గట్టిగా కృషి చేయాలని త్రిపురాణ వెంకటరత్నం సూచించారు. జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ సోషల్ ఆక్షన్ కమిటీలు బాధితులకు, న్యాయ సేవకులకు వారధిలాంటి వారని, చట్టాల పట్ల అవగాహన లేక పోలీస్ స్టేషన్లకు వెళ్లేందుకు భయపడి మధ్యవర్తులను ఆశ్రయించి బాధితులు రెండోసారి మోసపోతున్నారని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు, సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు మోసపోతున్నారని, వీటి పట్ల అవగాహన కల్గించాలని సూచించారు. ఏదేని ఆశ్రమ పాఠశాలలో అవాంఛనీయ సంఘటన జరిగితే ఆ గ్రామం మొత్తం నుండి ఎవరిని పంపరని, ఇట్టి స్థితి నుండి బయటపడాలని అన్నారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి అని తెలిపారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ ద్వారా కమిటి సభ్యులకు మహిళల రక్షణ- చట్టాలపట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కృష్ణజ్యోతి, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, ఐసిడిఎస్ పిడి మోహన్ రెడ్డి, మెప్మా పిడి రవీందర్, డిఆర్‌డిఎ ఎపిడి రమేష్ కుమార్, హైకోర్టు న్యాయవాదులు విజేత, మంజూష, సోషల్ ఆక్షన్ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చట్టాల పట్ల మహిళలకు అవగాహన ఉండాలి
* ఆర్థిక సాధికారితతోనే సామాజిక, రాజకీయ సాధికారత
* రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 11: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాల పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులకు రెండు రోజులు మహిళా చట్టాలపై అవగాహన-శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో మనుషుల ఆలోచన తీరు మారాలని, అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూసే ధోరణి మారాలని అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుండి వారికి ఇవ్వాల్సిన స్వాతంత్య్రం వారికి ఇస్తూనే సమాజంలో పరిమితుల గురించి తెలియజెప్పే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. 2011-12 సంవత్సర కాలం వరకు మహిళలు వంటింటికే పరిమితం కాదని, మహిళల సాధికారత కోసం ఎంతో కృషి జరిగిందని చెప్పారు. రాను రాను ఇపుడు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై పోరాటాలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. మహిళల సాధికారతలో మొదట ఆర్థిక సాధికారత పొందిననాడే సామాజిక, రాజకీయ సాధికారత వస్తాయన్నారు. నేడు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు పొంది 50 శాతం మహిళలు ప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నప్పటికీ చాలా చోట్ల మహిళలకు బదులు వారి భర్తలు అధికారం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణిలో మార్పు రావాలని, మహిళలే పరిపాలన చేసేవిధంగా చర్యలు చేపట్టాలని, మహిళలు అధికారంలో ఉన్నప్పుడే మహిళల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎన్ని చట్టాలు చేసినా నేడు బాల్య వివాహాలు, జోగిని దురాచారాలు బయటపడుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పునకు మహిళల్లో పెద్దఎత్తున చైతన్యంతో పాటు వారి రక్షణ సాధికారత కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాల పట్ల పూర్తిగా అవగాహన కలిగేలా మహిళా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు గట్టిగా కృషి చేయాలని త్రిపురాణ సూచించారు. జిల్లా ఎస్పీ డి జోయల్ డేవిస్ మాట్లాడుతూ సోషల్ యాక్షన్ కమిటీలు బాధితులకు, న్యాయ సేవకులకు వారధిలాంటివన్నారు. చట్టాల పట్ల అవగాహన లేక పోలీస్ స్టేషన్లకు వెళ్లేందుకు భయపడి మధ్యవర్తులను ఆశ్రయించి బాధితులు రెండోసారి మోసపోతున్నారని తెలిపారు. ఆన్‌లైన్ మోసాలు, సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు మోసపోతున్నారని, వీటి పట్ల అవగాహన కల్గించాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ ద్వారా కమిటీ సభ్యులకు మహిళల రక్షణ- చట్టాల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కృష్ణజ్యోతి, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, ఐసిడిఎస్ పిడి మోహన్ రెడ్డి, మెప్మా పిడి రవీందర్, డిఆర్‌డిఎ ఎపిడి రమేష్ కుమార్, హైకోర్టు న్యాయవాదులు విజేత, మంజూష, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

దొంగనోట్ల ముఠా అరెస్టు
* రూ. 2లక్షల 9500స్వాధీనం
జగిత్యాల డిఎస్పీ రాజేంద్రప్రసాద్
కోరుట్ల, ఫిబ్రవరి 11: లక్షకు మూడు లక్షల రూపాయిలు ఇస్తామంటూ దొంగ నోట్లు చలామణి చేస్తున్న 4గురు వ్యక్తుల కోరుట్ల పట్టణంలో పట్టుకున్నట్లు జగిత్యాల డిఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం కోరుట్ల సిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఒకటికి మూడింతలు డబ్బులు ఇస్తామంటూ దొంగనోట్లు చలామణి చేస్తున్న కోరుట్లకు చెందిన కొడుకునూరి కిషన్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామానికి చెందిన గంథం భూమేశ్వర్,కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన జాగిలం శంకర్, మెదక్ జిల్లా చేగుంటకు చెందిన నెల్లూరి దశరథం అనే 4గురు దొంగనోట్ల ముఠా జగిత్యాల నుండి నిజామాబాద్‌కు ఎపి-09బివై 8393అనే రెడ్ కలర్ షిఫ్ట్ కారులో వెళ్తుండగా కోరుట్ల సిఐ రాజశేఖరరాజు, మేడిపల్లి ఎస్సై రవి, రాయికల్ ఎస్సై తిరుమల్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన స్పదంగా కనిపించిన కారును తనిఖీ చేయగా అందులో రూ. 2లక్షల 9500 దొంగనోట్లుచలామణి చేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. గతంలో వీరు నకిలీ నోట్లు చలామణి చేసిన వారేనని, వెస్టు బెంగాల్ రాష్ట్రంలోని ముల్తా నుండి ఈ దొంగనోట్లు తీసుకొచ్చి ఇక్కడ చలా మణి చేస్తున్నట్లు డిఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఈసమావేశంలో కోరుట్ల సిఐ రాజశేఖరరాజు, ఎస్సైలు బాబూరావు, అక్రమ్ పాషా,రవి, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న అభివృద్ధి బృహత్తర ప్రణాళిక
రూ.400కోట్లతో ఆలయ అభివృద్ధి
సేవయే ఏకైక ఎజెండా
ఎమ్మెల్యే రమేశ్‌బాబు

వేములవాడ,్ఫబ్రవరి 11:స్వామివారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులకు అవసరమైయ్యే అన్నీ ఏర్పాట్లను చేస్తాం..అందుకోసం బృహత్తర కార్యాచరణ ప్రణాళిక సిద్దమైంది.. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా ఏకైక ఎజెండాని ఎమ్మెల్యే రమేశ్‌బాబు చెప్పారు. గురువారం శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నాక ఆయన ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రూ.400కోట్లతో ఆలయాన్ని సర్వంగా సుందరంగా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే రూ.100కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు.రోడ్లు,వందపడకలు,టూరిజం,బ్రిడ్జి,వేద సంగీత పాఠశాల,విశాలమైన కల్యాణ మండపం,్భక్తులకు వెయ్యి వసతిగదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు.త్వరలోనే ఆలయ వైబ్ సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రెస్ సభ్యులందరకి డబుల్ బెడ్‌రూంలను కట్టిస్తామని అన్నారు. ఈ సమావేశంలో తెరాస నాయకులు పొలాస నరేందర్, ఎంపిపి రంగు వెంకటేశం,జడ్పిటీసీ శ్రీకాంత్,నాయకులు ఎర్రం మహేశ్,ముప్పిడి శ్రీనివాస్,పీచర భాస్కర్‌రావు,ప్రసాదరావులు పాల్గోన్నారు.
రాజన్న సేవలో...
శ్రీ రాజరాజేశ్వరస్వామిని గురువారం ఎమ్మెల్యే రమేశ్‌బాబు దర్శించుకున్నారు. స్వామివార్ల,అమ్మవారి దర్శనానంతరం కల్యాణ మండపంలో అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేయాలి
* రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
’ వ్యక్తి గత మరుగుదొడ్లపై మంత్రి నియోజకవర్గ స్థాయి సమీక్ష

హుజూరాబాద్, ఫిబ్రవరి 11: హుజూరాబాద్ నియోజకవర్గంలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని సాయి గార్డెన్‌లో గురువారం ఐ ఎస్ ఎల్ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమీక్ష జరిగింది. దీనికి కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్‌తో పాటు అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేందర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరుగుదొడ్ల పథకం కింద మొత్తం రాష్ట్రానికి రూ.50కోట్లు మంజూరైతే కేవలం కరీంనగర్ జిల్లాకే 22 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుంటేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, వార్డు సభ్యులు వెంటనే గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు చైతన్యం చేయాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సిమెంటు రూ.200 లకే ప్రభుత్వం అందజేస్తుందని, 20 శాతం తక్కువ ధరకు రేకులు కూడా ఇస్తున్నామని, ఇసుక కూడా లబ్దిదారులకు అందుబాటులో ఉంచాలని రెవిన్యూ, పోలీసు యంత్రాంగానికి ఆదేశాలిచ్చామన్నారు. ఇక ముందు వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేసిన సర్పంచ్‌లు మాత్రమే తనను సంప్రదించాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్, ఎ జె సి నాగేందర్ మాట్లాడుతూ అధికారులు లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షిస్తూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

‘జాతర’కు ముమ్మర ఏర్పాట్లు
* సిద్ధమవుతున్న భక్తులు
* 17నుంచి జిల్లాలో జాతర
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, ఫిబ్రవరి 11: సమ్మక్క-సారలమ్మ జాతరకు ఐదురోజులే గడువు ఉండడంతో జాతర ప్రాంతాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 17 నుంచి 20వ తేదీవరకు జాతర జరుగనుండగా, జిల్లాలో 40 చోట్లకుపైగా సమ్మక్క-సారలమ్మ జాతర జరుగనుంది. ఈ మేరకు జాతర జరిగే ప్రాంతాల్లో ఇటు జిల్లా అధికార యంత్రాంగం, అటు జాతర కమిటీలు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఇటీవలే జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా జాతరలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ద్య చర్యలు చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తోపాటు అన్ని మండలాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర జరుగనుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే జాతర ప్రాంతాల్లో భారీ కేడింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పందిళ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాల సముదాయాల కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. జాతర సమయం సమీపిస్తున్న తరుణంలో నిర్వహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్‌శాఖ తగిన బందోబస్తు చర్యలు చేపట్టనుంది. ఓ వైపు జాతర ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతుండగా, మరోవైపు భక్తులు ఆ తల్లులను దర్శనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన సరంజామాను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అటు యంత్రాంగం, ఇటు జాతర కమిటీలు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

కార్మిక సంఘాల నేతలపై మరమగ్గాల యజమానుల దాడి
* కార్మికుల సమ్మెలో ఘర్షణ, నేతలకు గాయాలు
* మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చిన కార్మికులు
సిరిసిల్ల, ఫిబ్రవరి 11: సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న కాటన్ పవర్‌లూం కార్మికుల సమ్మెలో గురువారం ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటనలో కార్మిక సంఘాల నాయకులపై మరమగ్గాల యజమానలు దాడి చేయడంతో కార్మికులు పెద్ద సంఖ్యలో మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. ఈ సంఘటనలో సిపిఐ మండల కార్యదర్శి పోలు కొమురయ్యకు గాయాలు అయినట్టు చెప్పారు. చినిగిన చొక్కాతోనే ఆయన పోలీస్ స్టేషన్‌కు కార్మికులతో కలిసి వచ్చారు. ఈనెల ఒకటి నుండి కాటన్ పవర్‌లూం కార్మికులు కూలీ పోరాటంలో భాగంగా పనులు నిలిపి వేసి సమ్మె చేపట్టి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే యజమానులు ఎవరూ పనులు నిర్వహించనీయకుండా కార్మికులు నిఘా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పద్మనగర్‌లో మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తులు సాగిస్తున్న యజమాని వద్దకు కార్మిక సంఘాల నాయకులతో కలిసి కార్మికులు వెళ్ళారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. పవర్‌లూం యజమానులు కార్మిక నాయకులపై దాడులకు పాల్పడినట్టు తెలిపారు. కోడం బాలకిషన్, కోడం నరేందర్, కోడం చంద్రయ్య, అతడి భార్య నలుగురు కలిసి కార్మిక సంఘాల నాయకులైన సిఐటియు కార్యదర్శి మూషం రమేశ్, సిపిఐ మండల కార్యదర్శి పోలు కొమురయ్యలపై దాడి జరిగినట్టు ఆరోపించారు. ఇందులో పోలు కొమురయ్య గాయాలు అయినట్టుగా ఆరోపించారు. మూషం రమేశ్, పోలు కొమురయ్యలు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చి పవర్‌లూం యజమానులపై ఫిర్యాదు చేశారు.

అప్పులతో రైతు బలవన్మరణం
కోనరావుపేట, ఫిబ్రవరి 11: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన మారుపాక శంకర్(32) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన నాలుగు ఎకరాల భూమిలో వరి పంట వేయగా నీరు లేక పంట ఎండిపోయింది. ఇప్పటికే చేసిన అప్పులకు పంటల కోసం చేసిన అప్పులు నాలుగు లక్షల మేరకు పేరుకోయాయి. దీనితో అప్పుల వారి నుండి వేధింపులు తీవ్రం కావడంతో మనస్థాపానికి గురై గురువారం పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లలిత, కుమారులు అజయ్, ఆదర్ష్‌లు ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాజ్‌కుమార్‌గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి ఎన్‌డిఎ కట్టుబడి ఉంది
- త్వరలోప్రధాని చేతుల మీదుగా ఎరువుల ఫ్యాక్టిరికి శంకుస్ధాపన
- బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల
గోదావరిఖని, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి, ఎన్‌డి ఎ ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యాక్షులు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం రామగుండం ఎరువుల ఫ్యాక్టరి సమీపంలోని ఎలకలపల్లి గేటు వద్ద కరీంనగర్ జిల్లా సంఘటిత. అసంఘటిత కార్మిక సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరణ జరుపుతుందన్నారు. ఇందు కోసం ప్రధాన నరేంద్ర మోడి చేతుల మీదుగా కొద్ది రోజుల్లోనే ఎరువుల ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. ఎరువుఫ్యాక్టరీలో పనులు కల్సిస్తామని కొంత మంది నిరుద్యోగులను మెసగించి, డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారి మెసాలకు స్ధానికులు గురి కావద్దని అన్నారు. ఎరువుల ఫ్యాక్టరీలో స్ధానికులకే ఉద్యోగాలు కల్పిస్తారని అన్నారు. ఇందుకోసం కేంద్ర ఎరువుల రసాయణ శాఖ మంత్రి కూడా స్ధానికులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు హామి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరి సీనియర్ నాయకుడు ఎం సుందర్ రాజు అధ్యక్షతణ వహించగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నం అంజయ్యతో పాటు స్ధానిక నాయకులు పోచం యాదవ్, బొడ్డుపల్లి నారాయణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.