కరీంనగర్

కేంద్రం నిధులివ్వకున్నా.. పథకాలు అమలు చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 27: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకున్నా ఆయా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌లు తెలిపారు. కేంద్రానికి ట్యాక్స్‌లు కడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదని అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్‌లు ముఖ్య అథితులుగా హాజరై జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రహదారుల నిర్మాణ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిగిన ప్రతి వ్యక్తికి వంద రోజుల పనులు కల్పించాలని అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలను రూపొందించుకొని అంకితభావంతో మంజూరైన జాబ్ కార్డులలో కనీసం 50శాతం కూలీలకు పని కల్పించి లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో గ్రామాలను అభివృద్ధి చేసుకొనుటకు గానూ సంబందిత ఎంపిడిఓలు కీలక పాత్ర పోషించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 1210 గ్రామ పంచాయితీలు ఉండగా, అందులో 1077 గ్రామ పంచాయతీలలో పనులు ప్రారంభించి నేటి వరకు 1,10,590 మందికి ఒక్కరికి రూ.133 చొప్పున చెల్లించి ఉపాధి కల్పించినట్లు మంత్రి జూపల్లి వివరించారు. జిల్లాలో ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు మూడు రోజుల్లోగా 74.63 శాతం డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. ముత్తారం, సారంగపూర్, జగిత్యాల, ఇల్లంతకుంట, గొల్లపల్లి మండలాలలోని కొన్ని గ్రామాలలో ఉపాధిహామీ పనులు ప్రారంభించక పోవడంపై సంబంధిత ఎంపిడిఓలపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఫీల్డ్ అసిస్టెంట్లు లేని కారణంగా పనులు ప్రారంభించలేక పోయామని వారు వివరణ ఇవ్వగా వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. ఉపాధి హామీలో శాశ్వత పనులకు ప్రాధాన్యతనిచ్చి గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, వ్యవసాయ గోదాములు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇందిర జలప్రభ, హరితహారం, పంచాయతీరాజ్ రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. వందశాతం వ్యక్తి గత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించిన గ్రామాలకు గోదాముల నిర్మాణం, సిసి రోడ్ల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. మండలానికి 5వేల పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని తొలగిస్తూ జాబ్ కార్డుల ఆధారంగా కనీసం 50శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. వారానికొకసారి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో 50 శాతం ఉపాధి హామీ లక్ష్యాన్ని చేరుకొనుటకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రహదారుల నిర్మాణాల పనులలో నాణ్యతను పాటించాలని, లేనిచో వారిపై చర్యలు తప్పవని ఆర్‌అండ్‌బి అధికారులను హెచ్చరించారు. కేజీవీల్ ట్రాక్టర్లు రోడ్లపై నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి హెచ్చరించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. కానీ మండల, గ్రామ స్థాయిలలో ఆచరణలోకి రాకపోవడం వలన ఆశించిన స్థాయిలో అభివృద్ది జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీలో 6లక్షల 57వేల 866 జాబ్ కార్డులు ఉన్నాయని, అందులో 3లక్షల 26వేల మందికి రూ.420కోట్లు ఖర్చు చేసి వంద రోజుల పనిదినాలు కల్పించినట్లు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, శాసనసభ్యులు గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.