కరీంనగర్

అగ్రవర్ణాలపై వివక్ష విడనాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లాపూర్, మే 31: మండల కేంద్రంలో మంగళవారం ఓసి జెఎసి ఆధ్వర్యంలో ఓసి గర్జనను చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి వేల సంఖ్యలో అగ్రవర్ణాల ప్రజలు వచ్చారు. మండల కేంద్రంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నుండి ఓసి జెఎసి గర్జన ర్యాలీని ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల వెంట ర్యాలీగా వెళ్లి తహశీల్ కార్యాలయంలో తహశీల్దార్ రవీందర్‌రాజుకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర జెఎసి చైర్మన్ నల్లా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ జనాభా ప్రాతిపాదికన విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓసిలకు 19 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఓసి కులాల్లోని పేద విద్యార్థులందరికి స్కాలర్‌షిప్ కల్పిస్తూ ప్రతి నియోజకవర్గంలో ఓసి విద్యార్థుల కోసం ఒక సంక్షేమ హస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. ఓసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యాపారి, పూజరులకు ప్రతి నెల రూ.3 వేలు పింఛను మంజూరు చేయాలన్నారు. షరతులు లేకుండా వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ సబ్సిడీలు, అన్ని రకాల రాయితీలు అందించి, ఆత్మహత్యలను నివారించేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమాల్లో సంఘం ఉపాధ్యక్షుడు కొక్కిరాల శ్రీ్ధర్‌రావు, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని పురుషోత్తంరావు, జిల్లా మహిళ అధ్యక్షురాలు చీటి శిరీషరావు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శివశ్రీనివాస్ గుప్తా, అల్లూరి ఆదిరెడ్డి, ఎంపిపి బద్దం విజయ-నర్సారెడ్డి, వాకిటి సత్యంరెడ్డి, గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, కుండ్ర శ్రీనివాస్‌రెడ్డి, మల్లాపూర్ మండల వెల్మ సంఘం అధ్యక్షుడు నర్సింగారావుతో పాటు దాదాపు 4 వేల మంది ఓసిలు పాల్గొన్నారు.