కరీంనగర్

ఆర్జీ-2లో 88శాతం బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యైటింక్లయిన్ కాలనీ, మే 31: బొగ్గు ఉత్పత్తికి కార్మికులు, అధికారులు సమన్వయంతో మరింతగా శ్రమించాలని సింగరేణి ఆర్జీ-2 జిఎం విజయ్‌పాల్ రెడ్డి సూచించారు. మే మాసానికి గాను ఆర్జీ-2లో 88శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆర్జీ-2 జిఎం కార్యాలయంలోని ఛాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. భూగర్భ గనుల వారిగా వకీల్‌పల్లి గనిలో 25,699 టన్నులతో 90శాతం, 7 ఎల్ ఇపి గనిలో 15,990 టన్నులతో 80శాతం, ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌ల వారిగా ఓసిపి-3లో 4,03,019 టన్నులతో 90శాతం, ఓసిపి-3 ఫేజ్-2 64,115 టన్నులతో 58శాతం బొగ్గు చేసినట్లు తెలిపారు. విపరీతంగా ఎండలు ఉండడంతో చాలా మంది కార్మికులు గైర్హాజరవుతున్నారని దీంతో బొగ్గు ఉత్పత్తి తక్కువగా జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఓసిపి-3లో నాలుగు ప్రమాదాలు జరగడం, కోల్ డిస్పాచ్‌లో ఏర్పడిన సమస్య వల్ల బొగ్గు ఉత్పత్తి ఆటంకం కలిగిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ బొగ్గు వెలికి తీస్తామని తెలిపారు. ఎన్టీపీసీ బొగ్గు ఎక్కువ మొత్తంలో తరలించేందుకు మరిన్ని వ్యాగెన్ల కోసం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కార్మికులు కష్టపడి వార్షిక లక్ష్య సాధనకు రూపొందించిన నివేదికలకు లోబడి కష్ట పడి పని చేయాలని సూచించారు. కార్మికులకు అధికారులు ఎప్పటికప్పుడు సహకరిస్తూ బొగ్గు ఉత్పత్తికి తోడ్పడాలని సూచించారు. విలేఖరుల సమావేశంలో డిజిఎం పర్సనల్ వెంకటేశ్వర్ రావు, ఎజిఎం రాజేష్, ఏజంట్ శ్రీనివాస్, ఐఇ డి చిరంజీవులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.