కరీంనగర్

సహకార సంఘాలు బలోపేతం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో సహకార బ్యాంకులను బలోపేతం చేస్తున్నట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం కెడిసిసి బ్యాంక్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక సహకార బ్యాంకుల్లో కంప్యూటరీకరణ చేసి, ఇటు రైతులకు, అటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. గత ఏడాది ఖరీఫ్‌కు రూ.480 కోట్లు, రబీకి రూ.320 కోట్లు, ఎల్‌టికి రూ.50 కోట్లు, ఎస్‌హెచ్‌జి రూ.55 కోట్లు, బంగారు రుణాలు రూ.100 కోట్లు, ఇతర లోన్‌లు రూ.50 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే రూ.1000 కోట్ల డిపాజిట్ టార్గెట్‌కు గాను రూ.623కోట్లు డిపాజిట్లు తీసుకున్నామన్నారు. రుణాల లక్ష్యం రూ.1200 కోట్లకు గాను రూ.719 కోట్లు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. 2015-16 సంవత్సరానికి రూ.12.50 కోట్లు లాభం వచ్చిందని వివరించారు. సహకార రంగాల ద్వారా రైతులకు సబ్సిడీలో విత్తనాలను అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో మొత్తం 500లకుపైగా ఎటిఎం కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో 120 ఎటిఎం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 50 ఎటిఎం కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో నాబార్డ్ అధికారులు, కెడిసిసి బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.