కరీంనగర్

లక్షలు వెచ్చిస్తున్నా తాగు నీటి సరఫరాలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూన్ 14: సిరిసిల్ల మున్సిపాలిటీలో లక్షలు వెచ్చిస్తున్నా ప్రజలకు తాగు సక్రమంగా అందించకపోవడంపై మంత్రి కె.తారకరామారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సిరిసిల్ల పట్టణ అభివృద్ది పనులపై మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లతో సమీక్షించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరిగిన ఈ సమావేశంలో కౌన్సిల్, అధికారుల తీరు సక్రమంగా లేదని అన్నారు. పారిశుద్ద్యం పనులు కూడా అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఎల్ ఎండి నుండి వచ్చే తాగు నీటి పథకం పైప్‌లైన్లు పగిలిపోయి, తాగు నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతున్నా వాటిని త్వరితగతిన మరమ్మత్తులు చేసి, ఇబ్బందిని తొలగించడంలో విపలమయ్యారని, తీవ్ర నిర్లక్ష్యం వహించారని మంత్రి అన్నారు. పైప్‌లైన్లు పగిలిపోవడంలో ఎవరి తప్పిదమో తేల్చకపోవడం విడ్డూరమన్నారు. ఇందులో ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టరు, మున్సిపల్ ముగ్గురిలో ఎవరి తప్పిదమో స్పష్టం చేయడం లేదని, దీనిపై వెంటనే నివేదిక అందించాలన్నారు. కాంట్రాక్టర్ తప్పిదమని భావిస్తే నోటీసులు ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఎవరి తప్పో తేల్చకుండా రూ.68 లక్షలతో 1700 మీటర్ల పైప్ నిర్మాణం చేపట్టారని, నిథులు పుట్నాల్లా ఖర్చు చేయడం సరికాదని, ఎక్కడ ఎంత అవసరమో అంతే పనిని చేపట్టాలని అన్నారు. పైప్‌లైన్ పగిలిపోయిన అంశంపై బాధ్యులు ఎవరో తేల్చాలని, దీనిపై స్పష్టత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. లక్షలు వెచ్చిస్తున్నా కొన్ని ప్రాంతాలలో తాగునీటి కోసం ఎందుకు గొడవలు జరుగుతున్నాయని కమిషనర్, చైర్‌పర్సన్‌లను మంత్రి ప్రశ్నించారు. వార్డుకు ఏడు ట్రిప్పులు, ఒక్కో వార్డుల్లో 11 ట్రిప్పులతో ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నప్పటికీ డిమాండ్ ఎక్కువ ఉన్నందున సమస్య వస్తున్నదని చైర్‌పర్సన్ వెల్లడించారు. పద్మానగర్ నీటి ట్యాంక్ నిండకపోవడం వల్ల అందరికీ నీరందడం లేదని కమిషనర్ వెల్లడించారు. సిరిసిల్ల పట్టణ అభివృద్దికి రూ.72 కోట్ల నిధులను రెండు విడతల్లో ఇస్తామని మంత్రి వెల్లడించారు. వీటిని నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. రూ.13 కోట్లతో పట్టణంలో చేపట్టిన రోడ్లు, డ్రైనీజీల పనులపై మంత్రి సమీక్షించగా, ఏ మేరకు ఈ పనులు జరిగాయో వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడం మంత్రి కమిషనర్‌పై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. లక్షలు వెచ్చిస్తున్నా పనులపై సమగ్ర అవగాహన లేకపోవడం విడ్డూరమన్నారు. నిధులు అడుగుతున్నారే తప్ప పనులపై ఎందుకు స్పష్టత లేదన్నారు. మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్‌లు సమాధానం చెప్పకపోవడంపై మంత్రి అసహానం వ్యక్తం చేశారు. తాను వార్డుల్లో పర్యటించడానికి వచ్చినపుడు అన్ని వివరాలతో అధికారులు ఎందుకు రావడం లేదన్నారు. పట్టణంలో జరిగే సమస్యలపై వాట్సప్‌లో పెట్టాలని సూచించానని, కౌన్సిలర్లు దానిని విస్మరించారని, ప్రజలే ఆ పనులు చేస్తున్నారని అన్నారు. లక్షలు వెచ్చిస్తున్నా మున్సిపల్ తాగు నీరు అందించడంలో విఫలం కావడం దారుణమన్నారు. టెండర్ ప్రక్రియను కుదించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున మొక్కలు నాటాలన్నారు. పది వార్డుల్లో ఆస్తిపన్నును ప్రయోత్మకంగా పెంచామని అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఆర్డీవో బిక్షానాయక్, ఆర్ అండ్ బి ఇఇ పాల్గొన్నారు.