కరీంనగర్

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, జూలై 1: దేశంలో ఎక్కడా ఉగ్రవాదులు దాడులు జరిగినా హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కట్ట రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు చెలరేగి పోతున్నారన్నారు. ఉగ్రవాదాన్ని మతం పేరుతో ముడిపెట్టడం అనేక అనర్థాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సోషల్ మీడియాపై నిఘా పెంచాలని, సైబర్ నేరాల అదుపునకు సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. సమావేశంలో బిజెపి మత్స్యసెల్ జిల్లా కన్వీనర్ జిట్టవేని అంజిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు జన్నారం విద్యాసాగర్, గంట్ల రవీందర్ రెడ్డి, అక్కపెల్లి తిరుపతి చారి, బోయిని వెంకటేశం, గాలిపెల్లి రాజు, కడార్ల చంద్రమోహనాచారి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.