కరీంనగర్

వేములవాడ రాజన్నను జిల్లాలోనే ఉంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 1: నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సిరిసిల్లలో కలపకుండా కరీంనగర్ జిల్లాలోనే ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. దశాబ్దాల చరిత్ర కలిగి శాతవాహనులు ఏలిన జిల్లా ఆధ్యాత్మిక, భక్తిప్రపత్తులతో వాసికెక్కింది. జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, అగ్రహారం తదితర ఆలయాలు జిల్లాలోనే ఉన్నాయని, ప్రభుత్వం చేపట్టిన నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కరీంనగర్ జిల్లాకు ఏ ఒక్క దేవస్థానం కూడా రావడం లేదని, ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ విన్నవిస్తున్న తరుణంలో ప్రజల పక్షాన వేములవాడను కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉంచాలని సిఎంకు రాసిన లేఖలో సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.