కరీంనగర్

విద్యుత్ చార్జీల పెంపు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 1: ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ మరిచి, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇష్టారాజ్యంగా విద్యుత్ చార్జీలను పెంచటం అప్రజాస్వామికమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి కుమార్ విమర్శించారు. పెరిగిన విద్యుత్ ధరలను నిరసిస్తూ శుక్రవారం ఆపార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందంటూ చెప్పుకుంటున్న సిఎం పేద,మద్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల నడ్డీ విరచటమే లక్ష్యంగా విద్యుత్ చార్జీలు పెంచాడని దుయ్యబట్టారు. సామాన్యుడికి విద్యుత్ అందుబాటులోకి తెస్తామంటూ, దేశంలోకెల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేందుకు కృషిచేస్తానని చెప్పి, వినియోగదారులపై బిల్లుల మోత మోగిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూనే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, జరిమానాల పేర లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్‌తో ఆవిర్భవించిన రాష్ట్రాన్ని బంగారంగా తీర్చిదిద్దుతానంటూనే రాష్ట్ర ప్రజానీకాన్ని జైళ్ళ పాలు చేస్తున్నారని దుమ్మెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెంచిన విద్యుత్ చార్జీలు సత్వరమే తగ్గించాలని, లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆపార్టీ నాయకులు గండి గణేశ్, శ్రీనివాస్, బోగె పద్మ, విజయ, రమ, వెంకటలక్ష్మి, మహేందర్, వి.్భస్కర్, గుంటి రంగస్వామిలతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందమందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.