కరీంనగర్

విద్యుత్ చార్జీలు తగ్గించే దాకా ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 1: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే దాకా తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్త ఉద్యమాలు కొనసాగిస్తామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఉచిత విద్యుత్ పేర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేసి ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం ట్రాన్స్‌కో ఎఈ కార్యాలయాన్ని ఆపార్టీ కార్యకర్తలు ముట్టడించి, ధర్నా చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సామాన్యుల నడ్డి విరిచేలా విద్యుత్ చార్జీలు పెంచటం అన్యాయమన్నారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్టమ్రని సగర్వంగా చెప్పుకుంటున్న సిఎం కెసిఆర్ ఏకపక్షంగా విద్యుత్ చార్జీలు పెంచటం సిగ్గుచేటన్నారు. రెండేళ్ళుగా రాష్ట్ర ప్రజానీకం తీవ్ర దుర్బిక్ష పరిస్థితులు ఎదుర్కొంటుండగా, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక సమస్యలనెదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చార్జీలు పెంచటం ఏమేరకు సబబని ప్రశ్నించారు. ఓవైపు బస్ చార్జీలు, మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజానీకంపై పెనుభారం మోపుతుందని దుయ్యబట్టారు. పెరిగిన విద్యుత్ చార్జీలతో వినియోగదారులపై ఏటా రూ.1550 నుంచి 3వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్రం విరివిగా నిధులు ఇస్తుందంటూ ప్రజలన మభ్యపెడుతూ పునర్విభజనకు పూనుకుంటున్నాడని, జనాభా ప్రాతిపదికన మాత్రమే నిధుల కేటాయింపులు జరుగుతాయని, జిల్లాల ఏర్పాటుతో నిధుల విడుదల అసంభవమన్నారు. అనంతరం ఎస్ ఈ రంగారావుకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు స్థానిక రహదారులు భవనాల శాఖ అతిథి గృహం నుంచి వందలాది మంది కార్యకర్తలతో ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో హుజురాబాద్ ఇన్‌చార్జి ముద్దసాని కశ్యప్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సంకు సుధాకర్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షకిల్ అహ్మద్, నాయకులు చెల్లోజి రాజు, కొరిటాల శివరామకృష్ణ, పాల రామారావు, ఆగయ్య, గంట రాములు, కామిడి సదాశివరెడ్డి, రొడ్డ శ్రీనివాస్, మంగళారపు తిరుపతి, డి.సత్యం, జాడి బాల్‌రెడ్డి, కె.రేఖ, నూజెట్టి వాణి, దూలం రాధిక, నూనె లత, కొత్తూరి జగన్, పుట్ట నరేందర్, గుడాల శ్రీనివాస్ పాల్గొన్నారు.