కరీంనగర్

రాజన్న ఆలయంలో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూన్ 1: హైదరాబాద్ ఐటి కారిడార్, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలకు సమీపంలో బాంబులతో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ సానుభూతి పరులు కుట్రపన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్రంలో హై అలర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. శుక్రవారం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఆలయంలోనికి అనుమతించారు. మెటల్ డిటెక్టర్ సహాయంతో భక్తులు తమ వెంట తీసుకువచ్చిన బ్యాగులను, ఇతరత్ర వస్తులను పరిశీలించారు. వారి వస్తువులను పరిశీలించారు చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని పూర్తి స్థాయిలో విచారించి, వారి వివరాలను ఆరా తీస్తున్నారు.