కరీంనగర్

రామగుండంను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూలై 3: అభివృద్ధిలో నూతన ఒరవళ్లతో తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం నగర పాలక సంస్థను ఆదర్శ నగరంగా తీర్చిదిద్ధుతామని మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ అన్నారు. పాలక వర్గం ఏర్పడి ఆదివారంతో రెండు సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ, టిఎస్ ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణతో కలిసి చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ది పనుల వివరాలను విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా వెల్లడించారు. జూలై 03, 2014 నుంచి రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో 53.30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, దీనిలో 18.37లక్షల విలువ గల పనులు పూర్తి చేయగా 19.57కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి 196.24కోట్ల రూపాయలు మంజూరు కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామగుండం నగర పాలక పరిధిలో అభివృద్ధి పనులకు బడ్జెట్ కింద 100 కోట్ల రూపాయలను కేటాయించిందని, కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద 86.60 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పనుల కింద 6.664 కోట్లను కేటాయించడం జరిగిందని, నగర పాలక పరిధిలో ప్రణాళిక బద్ధంగా, ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్ సహకారంతో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని చెప్పారు. గోదావరిఖని పట్టణంలో సింగరేణి సిఎస్‌ఆర్ కింద కేటాయించిన 5 కోట్ల రూపాయలతో ప్రధాన రహాదారి వెడల్పు, మురుగు కాలువల నిర్మాణ పనులు కొనసాగుతుండగా మిషన్ కాకతీయలో భాగంగా 59లక్షల రూపాయలతో రామగుండం, మల్యాలపల్లి, పికె.రామయ్య చెరువుల పూడిక తీత పనులు చేపట్టామని, 1.92కోట్లతో మల్కాపూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా చేపట్టి సుందరంగా తీర్చిదిద్ధుతామని మేయర్ స్పష్టం చేశారు. మిషన్ భగీరథలో భాగంగా నగర పాలక పరిధిలోని ప్రతీ ఇంటికి గోదావరి నీరు అందిస్తామని, ఇందుకోసం ప్రత్యేక రిజర్వాయర్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్ బాట నడుస్తూ రామగుండం అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం నగర అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని, అభివృద్ధి పనుల్లో నిధుల కేటాయింపుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు.