కరీంనగర్

గొంతు తడపండి.. మహాప్రభో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 22: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా, పల్లెలు, పట్టణాలకు తాగునీరందించే ప్రధాన నీటి వనరుల్లో నీళ్లు లేక ఏడారులను తలపిస్తున్నాయి. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణాల్లో బిందెలు, బకెట్లతో ట్యాంకర్ల వెంట పడుతుంటే, పల్లెల్లో వ్యవసాయ బావుల వెంట పరుగులు తీస్తున్నారు. ఏ ఇంటి ముందు చూసినా ఒకట్రెండు డ్రమ్ములు కన్పిస్తున్నాయి. అటు నల్లా నీటికి కటకట ఏర్పడగా, మున్సిపాలిటీల్లో రోజు విడిచి రోజు, కొన్నిచోట్ల మూడు రోజులకోమారు, గ్రామాల్లో వారానికోసారి నల్లా సరఫరా అవుతోంది. మార్చిలోనే త్రాగునీటి కష్టాలు చుక్కలను చూపిస్తుంటే, ఇక ఏప్రిల్, మే మాసాల్లో త్రాగునీటికి తండ్లాట తప్పదేమోననే బెంగ ప్రజల్లో నెలకొంది. త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు స్థానిక సంస్థల వద్ద సరైన నిధులు లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు లేక ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. గతేడాదికంటే ఈ ఏడాది జలాలు మరింత పాతాళానికి వెళ్లాయి. ఫలితంగా గ్రామాలు, పట్టణాల్లో త్రాగునీటి సమస్య రోజురోజుకు అధికమవుతోంది. గడిచిన వర్షాకాలంలో సాధారణ సగటు వర్షాపాతం కూడా జిల్లాలో నమోదు కాలేదు. చెరువులు, కుంటలకు చుక్క నీరు రాలేదు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీతోపాటు జిల్లాలోని ఎల్‌ఎండి రిజర్వాయర్, ఎగువ మానేరు, శనిగరం, కల్వల ప్రాజెక్టు, బొక్కల వాగు ప్రాజెక్టు తదితర మధ్యతరహా ప్రాజెక్టుల్లో సైతం నీళ్లు లేక ఏడారులుగా తలపిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లా అంతటా నీటి ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. గొంతులు తడపండి మహాప్రభో అంటూ గుక్కెడు నీటి కోసం ప్రజలు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. నిత్యం జిల్లాలోని నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా జగిత్యాల డివిజన్‌లోని అల్లీపూర్, రంగంపేట గ్రామ వాసులు త్రాగునీటి కోసం ఆందోళనకు దిగారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఎలాగైనా ఈ వేసవిలో త్రాగునీటి సరఫరా చేసి తమ ఇబ్బందులు తీర్చాలంటూ కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాగునీటి కొరత లేకుండా చర్యలు: కలెక్టర్ నీతూప్రసాద్
వేసవి దృష్ట్యా గ్రామాలలో, పట్టణాలలో త్రాగునీటికి కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆర్‌డిఓలు, మండల అధికారులతో కలెక్టరేట్ నుండి కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్ సిఆర్‌ఎఫ్ క్రింద 60 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని తెలిపారు. బోర్ల మరమ్మత్తులకు సిపిడబ్ల్యూఎస్ స్కీంలలో మరమ్మత్తులకు మంజూరీ ఇచ్చామని, ఉపాధి హామీలో ఓపెన్‌వెల్స్ నిర్మాణం చేసుకోవచ్చునని తెలిపారు. గ్రామాలలోని అధికారులు పరస్పర సహకారంతో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సిఆర్‌ఎఫ్ క్రింద అవసరమైన చోట బోర్లు అద్దెకు తీసుకోవాలని, ఇంకా ఇబ్బందులు ఉన్నచోట నీరు రవాణా చేయాలని చెప్పారు. దీనికోసం ఆర్‌డిఓలకు 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 366 హాబిటేషన్లలో అద్దెకు, 62 హాబిటేషన్లలో రవాణా ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెసి పౌసమి బసు, అదనపు జెసి నాగేంద్ర, జడ్పీ సిఇఓ సూరజ్ కుమార్, డిఆర్‌ఓ వీరబ్రహ్మయ్య, సిపిఓ సుబ్బారావు, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.