కరీంనగర్

2017 లోపు మధ్యమానేరు పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, జూలై 28: జిల్లాలోని సిరిసిల్ల మధ్యమానేరు పనులను 2017 లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కందికట్కూరు శివారు పల్లె అయిన గుర్రంవానిపల్లెలో నిర్మిస్తున్న మధ్యమానేరు ప్రాజెక్టు స్పిల్‌వేను ఆయన పరిశీలించారు. మధ్యమానేరు లోకి నీరు రావడంపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. 2017లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మధ్యమానేరులో ముంపునకు గురైన నిర్వాసితులందరికి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. నిర్వాసితులందరికి బకాయిలు కూడా చెల్లించడనికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మధ్యమానేరు జలాశయం నిండితే జిల్లాతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత పాలకుల తప్పిదాల వల్ల మధ్యమానేరు నిర్మాణపు పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలోనే ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుండి నిర్మాణపు పనులను చేపట్టుటకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. మంత్రితో పాటు జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపిపి ఐలయ్య యాదవ్, టిఆర్‌ఎస్ నాయకులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ఉన్నారు.