కరీంనగర్

ఎంసెట్ 2 రద్దు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 29: ఎంసెట్ 2లో జరిగిన అక్రమాల పేర రద్దు చేసే యత్నాలు మానుకోవాలని, కుంభకోణంలో భాగస్వాములైన వారి ర్యాంకులు నిలిపేసి, చర్యలు తీసుకోవాలంటూ ఎంసెట్ 2 విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్, తెలంగాణ చౌక్‌లలో ఆందోళనకు దిగారు. కొంతమంది చేసిన తప్పులకు తమ పిల్లలను బాధ్యులుగా చేస్తూ ఎంసెట్ 2నే రద్దుచేస్తే, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందంటూ రహదారిపై బైఠాయించారు. అక్రమార్కులను గుర్తించిన నేపథ్యంలో వారి ర్యాంకులు రద్దుచేసి, మిగతా వారికి కౌనె్సలింగ్ నిర్వహించాలని కోరారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎంబిబిఎస్‌లో చేరినట్లుగా భావిస్తున్న తమ పిల్లలు, తిరిగి ఎంసెట్ రాయాలంటే మానసికంగా సిద్ధమవటం అసాధ్యమని, రాత్రింబవళ్ళు కష్టించి, ర్యాంకులు తెచ్చుకుంటే, దానిని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చితే కోర్టుకెళ్తామని స్పష్టంచేశారు. ఆందోళనలో ఎంసెట్ ర్యాంకర్లు విదీశ, సానే షమీల, శ్రావణి, పావని, అక్షితరెడ్డి, శేఖర్‌లతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.