కరీంనగర్

దేశం మెచ్చే రీతిలో పుష్కరాల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 31: దశాబ్దాల వలస పాలనలో తెలంగాణ అన్యాయానికి, వెనకబాటు తనానికి, నిర్లక్ష్యానికి గురైందని, తొలి ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధన దిశగా కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ధర్మపురి క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణలో 80 శాతం గోదావరి, 69 శాతం కృష్ణానది ప్రవహిస్తున్నాయన్నారు. గతంలో గోదావరి అంటే రాజమండ్రియని, కృష్ణా అంటే విజయవాడ అనే భావనను వలస పాలకులు కల్పించారని, తెలంగాణ ఏర్పడితే ప్రజలు మెచ్చే రీతిలో పుష్కరాలు నిర్వహిస్తామని ఉద్యమ నేతగా ప్రకటించిన కెసిఆర్ దేశం మెచ్చేలా గోదావరి ఆది పుష్కరాలు నిర్వహించి, నిజం చేసి చూపారని కీర్తించారు. అదే స్ఫూర్తితో కృష్ణమ్మ పుష్కరాలు నిర్వహించనున్నామని వివరించారు. గత పుష్కరాలలో కెసిఆర్‌తో పాటు తమ ప్రభుత్వం వర్షాలు కురవాలని గోదావరిని, నారసింహుని పూజించామని, వేడుకున్నామని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని, ఇది తెలంగాణకు శుభ పరిణామమన్నారు. తెలంగాణలో అంతరాలు తొలగి, ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని దీవించాలని, నేడు గోదావరమ్మకు మొక్కామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, పెద్దపెల్లి ఎంపి సుమన్, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక, జడ్పీటిసి రాజమణి, వైస్ ఎంపిపి రాజేశ్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, మాజీ జడ్పిటిసి శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ సత్తమ్మ, ఉప సర్పంచ్ రామయ్య తదితరులున్నారు.