కరీంనగర్

ఆర్జీ-2లో 84శాతం బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యైటింక్లయిన్ కాలనీ, ఆగస్టు 2: జూలై మాసంలో సింగరేణి ఆర్జీ-2లో 4,86,300 టన్నులకు గాను 4,10,418 టన్నులతో 84శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు జిఎం విజయపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్జీ-2 జిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాస ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. భూగర్భ గనుల వారిగా వికెపి గనిలో 31,000 టన్నులకు గాను 20,311 టన్నులతో 66శాతం, జిడికె-7 ఎల్ ఇపిలో 20,800 టన్నులకు గాను 12,845 టన్నులతో 62శాతం సాధించిన్నట్లు, అదేవిధంగా ఓసిపి-3లో 3,34,500 టన్నులకు 3,18,136 టన్నులతో 95శాతం, ఓసిపి-3 ఫేజ్-2లో 1,00,000 టన్నులకు గాను 59,126 టన్నులతో 59శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు వివరించారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఈసారి బొగ్గు ఉత్పత్తిలో కొంత వెనకంజలో ఉన్నామని అన్నారు. కార్మికులు మరింత కృషి చేసి బొగ్గు ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. వివిధ పరిశ్రమల్లో సరిపడా బొగ్గు నిల్వలు ఉండడంతో మార్కెట్ సరిగ్గా లేదని, దీంతో డిస్పాచ్ చేయలేకపోతున్నామని తెలిపారు. ఓసిపి-3 నుంచి మరింత ఉత్పత్తి పెంచేందుకు ఈ నెలలో 6 డంపర్లు, 2 షవల్స్ కొత్తగా తీసుక రానున్నామని చెప్పారు. ఓసిపి-3లో వర్షాల కారణంగా వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నామని తెలిపారు. ఓసిపి-3 ప్రభావిత మంగల్‌పల్లిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి 2,126 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరిని మరో చోటకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఓటూ జిఎం రవీందర్, ఎజిఎం రాజేష్, డిజిఎం వెంకటేశ్వర్ రావు, అధికారులు చిరంజీవులు, రామక్రిష్ణ, రాజేంద్ర ప్రసాద్, జానకి రామారావు పాల్గొన్నారు.