కరీంనగర్

నేటి నుండి ప్రైవేటు విద్యాసంస్థల బస్ డ్రైవర్ల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర (కరీంనగర్), ఆగస్టు 4: కనీస వేతనాలు అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల బస్ డ్రైవర్ల చర్చలు విఫలమవడంతో శుక్రవారం నుండి సమ్మెకు దిగుతున్నట్లు కరీంనగర్ ప్రైవేటు స్కూల్స్, కాలేజి వ్యాన్స్ డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో యూనియన్ నాయకులకు, యాజమాన్యాలకు జరిగిన చర్చలు ఫలించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 840 ప్రైవేటు స్కూల్స్, 200 జూనియర్ కాలేజీలు, 200 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నాయని వీటిలో ఏ ఒక్కరికి కూడా కనీస వేతనం అమలు చేయడం లేదని సి ఐ టియు గౌరవ అద్యక్షులు గుడికందుల సత్యం పేర్కొన్నారు. సమ్మెలో డ్రైవర్లు, హెల్పర్లు తప్పకుండా పాల్గొనాలని సూచించారు.