కరీంనగర్

చేనేత కార్మికుల బతుకులు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 4: చేనేత కార్మికులు ఆధునిక కాలంలోనూ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారని, వారి బతుకులు మారాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో గురువారం కమలాపూర్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వసతుల సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ నేత కార్మికులతో పాటు రైతులు ఎంతో మంది పరిస్థితులు అనుకూలించక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇలాంటి స్థితి రాకూడదనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందని, రాబోయే కాలంలో వారికి ఆర్థిక, సామాజిక స్థితి గతులను అధ్యయనం చేసి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సిరిసిల్లతో పాటు అన్ని ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉన్నారని గత పాలకుల నిర్లక్ష్యం కారణం చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. గతంలో టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తాము భిక్షాటన చేసి డబ్బులు సేకరించి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. చేనేత కార్మికులకు కూలీ గిట్టుబాటు కావడం లేదని, కూలీ రేట్లు పెంచేందుకు తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత సిఎం కెసిఆర్ దేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వొడితెల సరోజినిదేవి, జౌళి శాఖ ఎడి వెంకటేశం, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, సర్పంచ్ ఇమ్మడి సుగుణ ఎల్లేష్ పాల్గొన్నారు.