కరీంనగర్

బాలింత మృతిపై బంధువుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 5: జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్డులో శుక్రవారం ఆర్యాన్ అనే ప్రైవేటు ఆసుపత్రి ఎదుట బాలింత మృతి చెందడం కలకలం రేపింది. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని గ్రామస్థులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేయగా ఉద్రిక్తలకు దారి తీసింది. జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన గుర్రం సమత (30) అనే 7మాసాల గర్భిణి శుక్రవారం పురిటి నొప్పులతో మూడవ ప్రసవం కోసం మృతురాలు భర్త తిరుపతిచే ఆసుపత్రులో చేరిందని గ్రామస్థులు తెలిపారు. అయితే అసుపత్రిలో చేర్చుకున్న వైద్యురాలు ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో బాలింత పరిస్థితి విషమించిందని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు రక్తం ఎక్కించినట్లు వైద్యురాలు వెల్లడించిందన్నారు. చికిత్స నిర్వహిస్తుండగా బాలింత మృతి చెందడంతో వైద్యురాలి నిర్లక్ష్యం మృత్యువాత పడిందని గ్రామస్థులు ఆందోళన చేశారు.