కరీంనగర్

అడవి బిడ్డలపై ఆకృత్యాలెలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 9: అభం శుభం తెలియని అడవి బిడ్డలపై పోడుభూముల సాగు పేరుతో పోలీసుల అకృత్యాలు ఆపి, ఆదివాసీలకు వారినుంచి విముక్తి కల్పించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జెవి చలపతిరావు డిమాండ్ చేశారు. ఆదివాసీలపై పోలీసుదాడులను నిరసిస్తూ మంగళవారం నగరంలోని తెలంగాణచౌక్‌నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి, తమకు న్యాయం చేయాలంటూ ఆదివాసీలు నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న చలపతిరావు మాట్లాడుతూ, అనాదిగా అటవీభూముల్లో వ్యవసాయం చేస్తూ తమకుటుంబాలను పోషించుకుంటున్న ఆదివాసీలపై అక్రమ కేసులు పెట్టి, దాష్టీకం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భూమి తల్లినే నమ్ముకుని బతుకీడుస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేలా వ్యవహరించటం సముచితం కాదన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపి, అటవీభూముల్లోంచి వారిని సాగనంపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలలనుంచి వచ్చిన ఆదివాసీలు పాల్గొన్నారు.