కరీంనగర్

డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికల్, ఆగస్టు 11: రాయికల్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉద్యమానికి మద్దతు తెలపడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గత నాలుగురోజుల నుండి డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం స్థానిక అంగడి బజారులు రిలే నిరహార దీక్షలు చేస్తుండగా, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. కళాశాల ఏర్పాటు కోసం సంబంధిత అధికారులతో మాట్లాడుతానని, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కళాశాల సాధన కమిటీ సభ్యులు ఉన్నారు.