కరీంనగర్

యువత ‘పడాల’ను ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఆగస్టు 16: నేటి యువత స్వాతంత్య్ర సమర ఉద్యమ నాయకుడు, క్విట్ ఇండియా ఉద్యమ నేత పడాల చంద్రయ్యను ఆదర్శంగా తీసుకోవాలని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దండుగుల రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. మండలంలోని ముల్కనూరులో మంగళవారం రాష్టప్రతి సన్మానానికి ఎంపికైన స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్యను వడ్డెర సంఘం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మిల బృందం ఘనంగా సన్మానించారు. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జి ముల్కనూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్యను రాష్టప్రతి సన్మానంకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దండుగుల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నాటితరం స్వాతంత్య్ర ఉద్యమ నాయకుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని భావితరం యువత ముందుకు నడువాలన్నారు. ఆనాడు స్వాతంత్య్ర సంగ్రామంలో పడాల చంద్రయ్య లాంటి పోరాట యోధుల త్యాగధనుల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. రానున్న రోజులలో పడాల చంద్రయ్య చరిత్ర అన్ని తరాల వారికి తెలిసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పడాల చంద్రయ్యను సన్మానించిన వారిలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధి గొర్ల ఐలేష్ యాదవ్, సంకల్ప స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షులు వల్స సుభాష్, టిఆర్‌ఎస్ నాయకులు పేర్యాల కాంతారావు, దండుగుల సంపత్ తదితరులు చంద్రయ్యను ఘనంగా సన్మానించారు.