కరీంనగర్

యువరాజు కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఆగస్టు 17: హుజూరాబాద్‌లో ఐటి కంపెనీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ల మధ్య రసవత్తరమైన సంభాషణలు, మాటలు చోటు చేసుకున్నాయి. ఐటి మంత్రి కెటిఆర్‌ను ఉద్దేశించి మాజీ ఎంపి పొన్నం పలుసార్లు యువరాజు అని తన ప్రసంగంలో సంబోధించారు. ఇందుకు కెటిఆర్ తన చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఐటిలో దూసుకుపోతున్నా ఎంతో ప్రాముఖ్యత ఉన్న వ్యవసాయ శాఖ అనుకున్న రీతిలో పనిచేయడం లేదని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు వ్యవసాయ శాఖను కెటిఆర్ చేపట్టాలని పొన్నం వ్యాఖ్యానించారు. అంతకు ముందు వేదిక వెనుక కూర్చున్న పొన్నంను ముందుకు రావాలని కెటిఆర్ పదే పదే ఆహ్వానించారు. ఈ పరిణామాలు చూసిన వారు పొన్నం గులాబీ గూటికి వెళ్లే అవకాశం ఉంటుందా? అని చర్చించుకోవడం కనిపించింది.