కరీంనగర్

‘పడాల’ జీవిత చరిత్ర భావితరాలకు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఆగస్టు 17: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అలుపెరుగని పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య చరిత్ర భావితరాలకు అవసరమని కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎంపి వినోద్ కుమార్‌ను భీమదేవరపల్లికి చెందిన తెలంగాణ జాగృతి హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మూల రాము గౌడ్ కలిసి పడాల చంద్రయ్య జీవిత చరిత్రను, స్వాతంత్య్ర ఉద్యమ పోరాటాలను గూర్చి వివరించారు. ఈ సందర్భంగా ఎంపి వినోద్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ నేత, క్విట్ ఇండియా ఉద్యమ నాయకుడు పడాల చంద్రయ్య జీవితగాథను పాఠ్యాంశాల్లోకి చేర్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా బుధవారం ముల్కనూరులో పడాల చంద్రయ్యను ఆయన స్వగృహంలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె, సురభి కళాశాలల అధినేత వాణిదేవి ఘనంగా సన్మానం చేశారు. భీమదేవరపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సయ్యద్ ఖాజా షరీఫోద్దీన్, ఫోరం ఉపాధ్యక్షుడు సల్పాల రాధిక-తిరుపతి ఆధ్వర్యంలో పూలమాలలు, శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. పడాల చంద్రయ్యను సన్మానించిన వారిలో సర్పంచ్‌లు గిరిమల్ల తిరుపతి, వనపర్తి రాజయ్య, కాలువ సునీత, బడుగు రాంచంద్రం, జిమ్మల భీంరెడ్డి, నకీర్త రాజయ్య, డాక్టర్ శంకర్, బొంకూరి భద్రయ్య, కత్తుల మల్లయ్య, ఎలుక రాములు, శాలువ రమేష్, ముత్తారం ఉప సర్పంచ్ ముత్యంరెడ్డి, మాజీ సర్పంచ్ పడాల గౌతం ఉన్నారు.