తెలంగాణ

వేములవాడను అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి కెటిఆర్ హామీ
హైదరాబాద్, మార్చి 11: యాదగిరిగుట్టలా వేములవాడను అభివృద్ధి చేయనున్నట్టు, వేములవాడ దశ తిరుగుతుందని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కెటిఆర్ సమక్షంలో కెటిఆర్ నివాసంలో వేములవాడ నగర పంచాయితీ అధ్యక్షురాలు నామా ఉమ, కొంత మంది కౌన్సిలర్లు టిఆర్‌ఎస్‌లో చేరారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ నాయకత్వంలో శుక్రవారం పార్టీలో చేరారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి పెద్ద పీట వేయనున్నారని తెలిపారు. మహారాష్టత్రో గోదావరి జలాలపై రాష్ట్రం ఒప్పందం చేసుకోవడం వల్ల కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు సస్య శ్యామలం అవుతాయని అన్నారు. ఉత్తర తెలంగాణలో గోదావరి నది నుంచి 950 టిఎంసిన నీటిని పూర్తిగా వాడుకోవచ్చునని అన్నారు. సుమారు లక్ష ఎకరాలకు సాగునీటిని అందించి వేములవాడను సస్యశ్యామలం చేయనున్నట్టు చెప్పారు. దక్షిణ కాశీగా వేముల వాడ శైవక్షేత్రానికి పేరు ఉందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ తయారు చేశారని తెలిపారు. యాదగిరిగుట్ట అభివృద్దికి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్టు , వేముల వాడకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. వేముల వాడ దశ తిరిగేలా పట్టణ రూపురేఖలు మార్చేలా ఎంత డబ్బులు ఖర్చయినా అభివృద్ధి చేస్తామని అన్నారు. వేములవాడ నుంచి సిరిసిల్లాకు మాత్రమే నాలుగు లైన్ల రోడ్ ఉందని, మిగతా రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా మార్చుతామని చెప్పారు. విదేశాల్లో మంచి జీవితాన్ని వదులుకొని చెన్నమనేని రమేష్ ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. వేముల వాడ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెన్నమనేని రమేష్ తెలిపారు.