రాష్ట్రీయం

త్వరలో రుణమాఫీ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో ప్రకటించిన తెలంగాణ
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ ప్రభుత్వం త్వరలో రుణమాఫీ చట్టాన్ని తీసుకువస్తుందని, దీని కోసం కసరత్తు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శాసనసభకు తెలిపారు. శనివారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే టి రామమోహన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్రప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రైతులకు ఉపశమనం కలిగించే విధంగా రుణమాఫీ చట్టాన్ని తెస్తామన్నారు. దీని వల్ల ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారుల బాధల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రైతుల రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు.
రిజర్వేషన్ల పెంపుపై విచారణ సంఘం: సిఎం కెసిఆర్
రాష్ట్రంలో గిరిజనులు, మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు వీలుగా జీవో ఎంఎస్ 5 ద్వారా విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శాసనసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్య తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ రిజర్వేషన్లపై విచారణ సంఘం నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. విచారణ సంఘం పనివేగవంతం చేసిందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు పూర్తవుతుందన్నారు.