తెలంగాణ

మంచినీటి చెరువుగా హుస్సేన్ సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గతంలో తాగునీటి చెరువుగా ఉన్న హుస్సేన్ సాగర్‌ను తిరిగి మంచినీటి చెరువుగా మార్చేందుకు బృహత్ ప్రణాళిక రూపొందించినట్టు టిఆర్‌ఎస్ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. కలుషిత జలాలను హుస్సేన్‌సాగర్‌లోకి మోసుకు వచ్చే నాలాల మళ్లింపు కార్యక్రమం ఇప్పటికే తుది దశకు చేరుకుందని తెలిపారు. హస్సేన్ సాగర్‌ను శుద్ధి చేయడం ద్వారా తిరిగి మంచినీటి చెరువుగా మార్చడానికి సిఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ మురుగునీటి కాలువలు నిర్మించడం ద్వారా ప్రభుత్వం మూసీ నదికి పూర్వవైభవం తీసుకు వస్తుందని తెలిపారు.