రాష్ట్రీయం

మరో రెండు రోజుల్లో మహావేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 14: కోట్లాది మంది భక్తజనం ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్షణాలు మరో రెండురోజుల్లో జరుగనున్నాయి...సమ్మక్క తల్లి దండాలో..సారలమ్మ తల్లి దండాలో అంటూ శివసత్తుల పూనకాలతో..జంపన్నవాగు భక్తజనంతో పులకరించేలా..మేడారం జాతర సాగుతోంది. మేడారం గుడారంలా మారనుంది. ఆదివారం నుండే భక్తులు మేడారం బాటపట్టారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక బస్టాండ్‌లో భక్తులు క్యూలు కడుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లులుగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం భక్తులు పడిగాపులు పడుతున్నారు. ఈ నెల 17 నుండి ఆరంభమయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ చల్లని తల్లుల జాతర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. మేడారంలో జరిగే జాతర కోసం అధికార యంత్రాంగం సర్వాంగ సుందరంగా మేడారాన్ని తీర్చిదిద్దింది. ఈ క్రమంలో 17న కనె్నపల్లి నుండి సారలమ్మ రాకతో ఆరంభమయ్యే మేడారం జాతర 18న సమ్మక్క రాకతో ఆకాశాన్నంటే సంబరాలతో అంగరంగ వైభవంగా సాగుతుంది. 19న తల్లులు భక్తులకు దర్శనం ఇస్తుండగా 20న ఇద్దరు తల్లులు తిరిగి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. నాలుగు రోజులు పండగకు మరో రెండు రోజులే సమయం ఉండడంతో ఇప్పుడు అందరి చూపు.. అందరినోటా మేడారం మాటే వినిపిస్తోంది. తల్లుల రాకకోసం ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చి మేడారంలో సేదతీరుతున్నారు. దీంతో మేడారం నేడు భారీ పట్టణంగా కనిపిస్తోంది. ఎటుచూసినా విద్యుత్ కాంతులతో ఓలాలడుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడు వెలుగులు విరజిల్లుతూ కొత్త మేడారం నేడు సంతరించుకుంది. భక్తుల సౌకర్యార్ధం మేడారం జాతరను 38 సెక్టోరియల్‌గా విభజించారు. ఒక్కో సెక్టోరియల్‌కు ఒక్కో సెక్టోరియల్ అధికారులు ఆదివారం తమ విధులలో చేరారు.
సెక్టోరియల్ అధికారుల కేటాయంపు
జాతరలో విధులు నిర్వహించే సెక్టోరల్ అధికారులకు బిఎస్‌ఎన్‌ఎల్ నంబర్లు కేటాయించారు. ప్రతి సెక్టార్‌కు అవసరాన్ని బట్టి 1 నుండి 3 సిమ్‌కార్డుల వరకు ఒక్కో సెక్టార్‌కు కేటాయించారు. జాతర సమయంలో సమస్యలు తలెత్తితే వీరికి ఫోన్‌చేసే వీలుంటుంది. కంట్రోల్‌రూం ఇన్‌చార్జిగా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హనుమంతు, ఎస్‌ఎస్‌ఏపిఓ రాజవౌళి, డిఆర్‌డిఎ ఎపిడి రాములు, ఐటిడిఎ క్యాంపు ఆఫీసు డిఆర్‌డి ఎపిడి విజయ్‌గోపాల్, ఎస్‌డిసి నూతి మధుసూదన్, డిఎస్‌ఓ ఉషారాణి, గెస్ట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో నల్గొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్‌రావు, చింతలగుట్ట వైపు జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, పోలీస్ క్యాంపు (టెంపుల్ ఎంట్రీ) వైపు సమాచార శాఖ ఎడి డిఎస్.జగన్, దేవతల గద్దె వద్ద జెడ్పీ సిఇఓ ఆంజనేయులు, మహబూబాబాద్ ఆర్డీఓ మధుసూదన్‌నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎడి సురేష్ ఉంటారు. గుడి నుంచి బయటకు వచ్చే దారిలో డిఎఫ్‌ఓ వెంకటేశ్వర్‌రావు, ఆర్టీసీ పాయింట్ వద్ద హౌసింగ్ పిడి లక్ష్మణ్ ఇలా ముఖ్యప్రాంతాల్లో ఒక్కొక్క అధికారిని నియమించారు. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలన్నింటిన్నీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.