రాష్ట్రీయం

600 మంది వైద్యులకు మెమోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: సొంత ఆసుపత్రులకు ప్రాధాన్యమిస్తూ విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న 600 మంది ప్రభుత్వ వైద్యులకు మెమోలు జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం గుంటూరులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో జరిగిన మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కామినేని వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు సక్రమంగా సేవలు అందించకుండా సొంత ఆసుపత్రులను నిర్వహిస్తున్న వారిని గుర్తించి మెమోలు ఇవ్వడమే కాకుండా మూడు ఇంక్రిమెంట్లపై కోత విధించడం జరిగిందన్నారు. రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో 500 మంది వైద్యులను, 1000 మంది నర్సులను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలలో బాలుని అదృశ్యంపై మాట్లాడుతూ పోలీసుల సమాచారం మేరకు ఏసోబు ఆచూకీ లభించిందన్నారు. అయితే వైద్యశాలలో సిసి కెమేరాలు సక్రమంగా పనిచేయడం లేదని విలేఖర్లు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా గురువారం సాయంత్రం మంత్రి కామినేని మోకాలి శస్తచ్రికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కామినేనికి శస్తచ్రికిత్స జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజు నాయుడు తెలిపారు.