మాతో - మీరు

భగత్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్
సభలోని లక్షల మందితో గొంతు కలిపి ‘మహాత్మాగాంధీకీ జై’ అని ఎలుగెత్తి అరిచిన భగత్‌సింగ్‌లోని విప్లవకారుడు జూలు విదిలించాడు... భగత్‌సింగ్ చదువుతున్నంతసేపు భగత్‌సింగ్ ఆత్మతో ప్రయాణం చేయించిన రచన మీది. మీ శైలి అనితరసాధ్యము. నిరుపమాన భగత్‌సింగ్ స్ఫూర్తి చల్లారిన యజ్ఞకుండము నుంచి వెలికితీస్తున్న అమృత రచనగా స్వాతంత్య్ర యోధునికి మీరిస్తున్న నిజమైన నివాళి.
-జొన్నలగడ్డ మార్కండేయులు (పేరవరం, తూ.గో.జిల్లా)
కొత్త ద్వారాలు
భగత్‌సింగ్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని చౌరిచౌరా సంఘటన వంకతో గాంధీ ఆపటం గురించి చిన్నప్పటి నుంచీ చాలా కన్ఫ్యూజన్‌గా ఉండేది. ఎందుకిలా నీరుగార్చటం అన్పించేది. మన మహాత్ముడు, అసలు మహాత్ముడు, భగత్‌సింగ్ చదువుతూంటే కొత్త ద్వారాలు కన్పిస్తున్నాయి. మన చరిత్ర ఎంత వక్రీకరింపబడిందో అన్పిస్తుంది. హేట్సాఫ్ టు యు సర్.
-సి.్భవానీదేవి (హైదరాబాద్)
రణక్షేత్రం
ఈ సీరియల్ ఎంతో ఆసక్తిదాయకంగా సాగుతోంది. కథని ఆయా పాత్రల కోణంలో చెప్పటం బాగుంది.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)
మీకు తెలుసా?
బ్రహ్మకమలం పనె్నండేళ్ల కొకసారి వికసిస్తుంది. అలాగే నీల్‌కురింజ కూడా అని తెలిసి ఆశ్చర్యపోయాం. ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు. అది మనుషులకు తప్ప కుక్కలకు కాదన్న మాట! రాబందులు మూత్రంతో కాళ్ల బాక్టీరియా శుభ్రం చేసుకోవడమూ వింతే. ఈ వారం ఎనె్నన్నో వింత విషయాలు చెప్పారు. మనస్సాక్షిని గౌరవించాలనీ, మనస్సాక్షికి భయపడాలంటూ చెప్పిన ‘సండే గీత’ బాగుంది. సంక్రాంతి లాంటి పర్వదినాల మర్నాడు కూడా పేపర్ తీసుకొస్తే లాభాలు కదా అన్న ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పారు. మెచ్చదగిన నిజాయితీ అది. దశాబ్దాల క్రితం ఒక ఇంగ్లీష్ పేపర్ అలాగే తెచ్చేది కాని దాని నిండా గత దినం ప్రచురించిన విశేషాలే ఎక్కువగా ఉండేవి!
-కె.సాహిత్య దీప్తి (రామారావుపేట)
ఓ చిన్న మాట
మన పిల్లలు చిన్న చిన్న సంతోషాలు కూడా కోల్పోతున్నారంటూ ‘ఓ చిన్న మాట’ చెప్పిన నగ్నసత్యాలు ఆలోచింపజేశాయి. కానీ ఏం లాభం? ఈ వేదన వినేదెవరు? తీర్చేదెవరు? వియత్నాంలో పరిఢవిల్లిన మన సంస్కృతి, సంప్రదాయాల మూలాలు విశేషాలు చక్కగా వివరించారు. చెవుడు నటించి తనని తానే హత్య నుంచి రక్షించుకున్న హంకీ కథ భలే సస్పెన్స్‌తో సాగింది. ఈ మధ్య మనం తాగుతున్నవీ, తింటున్నవీ అన్నీ కల్తీవే అని తెలిసి భయపడ్డాం. కల్తీ కల్లోలం వ్యాసం ఉపయుక్తంగా ఉంది. చైనాలో ఓ పెద్ద మనిషి వరాహమే వాహనంగా విహరించడం బానే ఉంది గాని అక్కడ జంతు హింస నివారణ సంఘాలు లేవా?
-బి.సోనాలి (సూర్యారావుపేట, తూ.గో.జిల్లా)
వియత్నాంలో శివాలయాలు
ఈ శీర్షికన 4వ శతాబ్దంలో విరాజిల్లిన శివాలయాల గురించిన విశేషాలు బాగున్నాయి. ‘నమ్మండి ఇది నిజం’లో ఫిలిప్పీన్స్‌లోగల గోడలు లేని జైలు గూర్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ‘మనస్సాక్షి’ శీర్షికన అందించిన వ్యాసం బాగుంది. మనస్సాక్షిని గౌరవించాలి.. అలాగే మనస్సాక్షికి భయపడాలంటూ చక్కగా తెలియజేశారు. చిన్న చిన్న విషయాలే ఆనందాన్ని కలిగిస్తాయని, ఆరోగ్యానికి ఆనందమే బలమని ‘ఓ చిన్న మాట’లో తెలియజేశారు. కృతజ్ఞతలు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
లోకాభిరామమ్
ఈ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు ఎంతో బాగుంటున్నాయి. ‘మంచి మనుషులు - మంచి కోతులు’ బాగుంది. అలాగే సిసింద్రీలో ‘కోతి అల్లరి’ చక్కటి నీతిని బోధించింది. కోతి మరో కోతి అల్లరిని మాన్పించగలిగింది కానీ మానవులం మనం ఎవరినీ మార్చలేక పోతున్నాం. ఈ కాలంలో ముఖ్యంగా హెల్మెట్ సంగతే చూడండి. అంటే మనకంటే కోతులే నయం అనిపిస్తోంది. అలాగే ‘బ్రెయిల్’ గురించిన విశేషాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. పిల్లలు గొప్పవాళ్ల జీవిత చరిత్రలు చదవాలి. టీచర్లు, తల్లిదండ్రులు ఆ పని వారి చేత చేయించాలి. అప్పుడైనా ఈ కాలం పిల్లలు వస్తువులతో కాక మనుషులతో మాట్లాడతారేమోనన్న చిన్న ఆశ.
-డి.వి.తులసి (రామవరప్పాడు, విజయవాడ)
కాశీ యాత్ర
గోపాలంగారి ‘కాశీ’ అనుభవాలు బాగున్నాయి. కాశీలో మాకూ అటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. మావారి జేబులోని పెన్నును తీసి విసిరేశాడు గుడి ముందున్న గార్డు. ఇరుకు సందుల్లో సరిగా అమర్చని నాపరాళ్ల దారి, వ్యాపారుల ప్రలోభాలు మమ్మల్నెంతగానో బాధించాయి. బ్రాహ్మణ సత్రంలో భోజనం ఉచితమయినా కొంత ద్రవ్యాన్ని అక్కడి హుండీలో వేశాం. కనీసం తొమ్మిది రాత్రులు కాశీలో నివాసం చేయాలిట. ఎందుకో ఉండబుద్ధికాలేదు. వారణాసి కాదుట - వారాణసి అని పిలవాలిట. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సైతం మానవుడి నీచపు ఆలోచనల్తో కలుషితమవుతున్నాయి అనటానికి ఇదొక ఉదాహరణ.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
రోబో
ఈ వారం ‘రోబో’ గూర్చిన వివరణ చాలా బాగుంది. విశే్లషణాత్మకమైన వివరణ అనేక విషయాలను తెలిపింది. ‘భగత్‌సింగ్’పై వస్తున్న సీరియల్ కథాకథనం చాలా బాగుంటోంది.
-గంగసాని పద్మారెడ్డి (హైదరాబాద్)