మాతో - మీరు

ఆశాదృక్పథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు తన వివేకం, ఆశావహ దృక్పథంతో మనసును భయాందోళనల నుండి సంతోషం వైపు మరల్చి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్న ‘సండేగీత’ స్ఫూర్తిదాయకంగా ఉంది. నాలుగు నిమిషాలపాటు గుండె ఆగిపోయి, తాత్కాలిక మరణం సంభవించాక, కాంపియన్ జీవితంలో జరిగిన అద్భుతాలని గురించి ‘నమ్మండి ఇది నిజం’లో చదివి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
18వ ఆవు
మనసులో ఆలోచన చేస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని 18వ ఆవు కథ నిరూపించింది. ఈ కథ లేక ఈ సమస్యని సుమారు ఏభై ఏళ్ల క్రితం ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో విడమర్చి చెప్పారు. ఈ సమస్యను తెనాలి రామకృష్ణ పరిష్కరిస్తాడు. కొన్ని పాత సినిమాలను పరిశీలించి చూస్తే ఎన్నో సంగతులు ఈనాటికీ అన్వయించుకునేటట్టు ఉంటాయి. పాత సినిమాలను ఏవగించుకొని కొత్త సినిమాల వెంబడి పరుగెత్తే యువతకు ‘ఓ చిన్న మాట’లో వచ్చిన ఈ సమస్య కొత్తగానే ఉంటుంది. ఆ సినిమా చూసిన వారికి కాదు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
‘ఎల్’ బోర్డు
జీవితమనే కారు డ్రైవింగ్‌లో ‘ఎల్’ బోర్డు ఎప్పుడూ ఉంటుంది. ఉండాలి కూడా. నేర్చుకోవడానికి అంతం ఉండదని, మనం భావిస్తూ నేర్చుకుంటూనే ఉండాలని ‘సండే గీత’లో చక్కగా చెప్పారు. ఓ చిన్న మాటలో ‘18వ ఆవు’తో ఒక సమస్యకి పరిష్కారాన్ని సూచించారు. చాలా సమస్యలను సృజనాత్మకంగా ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుందని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ‘కవర్‌స్టోరీ’ సహస్ర యశస్సులో చాలా విషయాలను తెలుసుకున్నాం. ‘పెద్ద మనసు’ సిసింద్రీ కథ బాగుంది. బడి బయట కూడా పిల్లలు చేసే మంచి పనులకు ప్రత్యేక బహుమతులివ్వటం ప్రత్యేకంగా అనిపించింది.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
తత్వవేత్తలు
క్రీస్తు శకం ఆవిర్భవించిన 8వ, 11వ, 13వ శతాబ్దాలలో శంకరుల అద్వైతము, రామానుజుల విశిష్టాద్వైతము, మధ్వాచార్యుల ద్వైతము.. అనే పరిశోధనా సిద్ధాంతాలు దైవ స్వరూపాలను, ఆత్మ పరమాత్మల ఉనికిని వివరిస్తూ ఆవిష్కరింపబడ్డాయి. వీటి తరువాత వెలువడిన వేదాంత భాషితాలన్నీ ఈ మూడు తత్వాల మీద ఆధారపడి ఏర్పడినవే. ఈ ముగ్గురు తత్వవేత్తలు తాము ప్రతిపాదించిన తత్వ విచారణల మూలం వేదాలు, ఉపనిషత్తులు అయినప్పటికి వాటి వ్యాఖ్యానాలు ఒకే విధంగా లేవు. అయినా అవన్నీ భగవద్భక్తిని బోధించేవిగా, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవిగా, మానవ సంబంధాలను పెంచేవిగా వివరింపబడ్డాయి కాబట్టి ఎవరే పద్ధతిని నమ్ముకున్నా అంతిమంగా జీవిత పరమార్థమొక్కటేనని చాటి చెప్పాయి. శ్రీరామానుజుల వారి జీవిత, వేదాంత చరిత్రను అందించినందుకు కృతజ్ఞతలు.
-ఎన్.ఆర్. (సికిందరాబాద్)
మనోభావాలు
జనం కథలు జానపదుల నోట నానే కథలు. ఈ కథలన్నీ ఎక్కడో చదివినట్టే అనిపించి అలరిస్తాయి. అందుక్కారణం జానపదులు ఏ దేశం వారైనా వారి మనోభావాలు, కల్పనా చాతుర్యం ఒకటే. జానపద గాథలు అనువదించి పుస్తక రూపంలో తేవడానికి గోపాలంగారి తపన శ్లాఘనీయం. తన రెండు వీలునామాల్లోని తికమకని సర్దుబాటు చేసేందుకు చనిపోయిన తండ్రి పెద్ద కొడుక్కి కనిపించి బైబిల్‌లోని జెనెసిస్ 27 చూడమనడం.. అతడు మరెవ్వరికి కనిపించకపోవడం బైబిల్‌లో మూడవ వీలునామా బయటపడటం అంతా ఊహాతీతంగా ఉండి ఆకట్టుకుంది. ఇదొక నమ్మలేని నిజం! నమ్మాలనిపించే నమ్మలేని నిజం!
-బి.ప్రభాస్ (గాంధీనగర్)
కొత్తదనం
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారంలో కొత్తదనం, సృజనాత్మకత ఉండాలని చెప్పిన ‘ఓ చిన్న మాట’లో ఒక గొప్ప సత్యం ఇమిడి ఉంది. చార్లీచాప్లిన్ 128వ జయంతి రోజున ఆయన వేషంలో 662 మంది ఒకచోట చేరడం చాప్లిన్ కిచ్చిన గొప్ప నివాళి. చూపు సరిగా లేనందువల్ల ప్రేక్షకుల ప్రతిస్పందన తెలియక తన ఆత్మానందం కోసమే నాయుడుగారు వయొలిన్ వాయించుకునేవారు. చూపు ఉంటే ప్రేక్షకుల ప్రతిస్పందన కనిపించి వారి మనోరంజనం కోసం తను కొంత దిగజారి వాయించవలసి వస్తుందని ఆయన నేత్ర చికిత్సను తిరస్కరించడం కడుపులో దేవినట్టు అయింది. అందుకే ఆయన, ఆయన లాంటి వారు అమరులయారు.
-కె.హితీక్ష (రమణయ్యపేట)
ఆనందం
శ్రీమద్రామానుజుల వారి జీవితం, ముఖ్య ఘట్టాలు కవర్‌స్టోరీలో చదివి ఆనందించాం. పది మందికి మంచి జరిగేదైతే ఒకరికి కీడు కలిగినా ఫర్వాలేదు. అందరికీ మోక్షం లభిస్తుందంటే నేను నరకానికి వెళ్తానన్న సిద్ధాంతం అమోఘం. క్రైం కథ ‘ఒప్పందం’లో గిల్బర్ట్ దొంగని చంపడమే కాక ఆ దొంగతో తన భార్యని చంపించి ఆస్తి దక్కించుకునే పథకం బాగుంది. ఇలాంటి కథలకు సస్పెన్స్ ప్రాణం లాంటిది. ఈ కథలో సస్పెన్స్ బాగా కుదిరింది. హాస్య కథ భలేగా నవ్వించింది. పునర్జన్మ ఉందని చాలామంది ఉదాహరణలు చూపుతారు. లేదని కూడా చాలామంది శాస్త్రాలను చూపుతారు. ఎవరి నమ్మకం వారిది అన్నట్లు మిగిలిపోయింది ‘పునర్జన్మ’ ఉందా అన్న ప్రశ్న!
-ఆర్.శాంతి చంద్రిక (సామర్లకోట)
అనంత పయనం
ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు చలాకీగా ఉంటాం. నేర్చుకోడానికి వయస్సు అడ్డం కాదు. జీవితమే ‘ఎల్’ బోర్డుతో అనంత పయనం - అంటూ చక్కగా సండే గీతలో చెప్పారు. గిన్నిస్ రికార్డుకు ఎక్కబోతున్న అతి పొడవైన పిల్లి, గుర్రుపెట్టి నిద్రపోతే బరువు తగ్గడం లాంటి వింతలు భలేగా ఉన్నాయి. అక్షరాలోచనల్లో ‘మనసే ఒక అద్దం’ కవిత బాగుంది. మనసు అనే అద్దంలో నీ ముఖం చూసుకో! ఎంత సమగ్రంగా ఉందో! అన్న భావన నచ్చింది.
-ఆర్.మరుదకాశి (కరప)