మాతో - మీరు

రిటర్న్ గిఫ్ట్ (మాతో-మీరు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలల బేహారులు
‘కవర్ స్టోరీ’ కలల బేహారులు - ఇప్పటి తరం యువత కలలు కంటూ వాటిని నెరవేరే వరకు ఎంతగానో కృషి, పట్టుదలతో తమ కలలను నిజం చేసుకుంటున్నారన్నది యధార్థం. ‘సండే గీత’లో వనరులు - గురించి చక్కగా తెలిపారు. మనకున్న గోల్స్ నిర్దేశించుకొని, ప్రయత్నిస్తే మనం ఏదైనా సాధించగలమని వివరించారు. కృతజ్ఞతలు. ‘పచ్చలైటు’ జీవితం చాలా చిన్నది వేచి చూస్తూ కూర్చుంటే అది కరిగిపోతుందని, ప్రయాణం చేయడమే అందరి పని అని జింబోగారు చెప్పిన తీరు మాకెంతో నచ్చింది.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
ఉపయుక్తం
ఆదివారం అనుబంధంలో ‘మీకు మీరే డాక్టర్’ శీర్షిక ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. ఈ వారం వేపుళ్ల వల్ల కలిగే అనర్థాలు గురించి చక్కగా వివరించి మా కళ్లు తెరిపించారు. మేము ఇష్టంగా తినే వాటిలో ఆలూ చిప్స్ కూడా ఉన్నాయి. ఇకపై కట్! కవర్‌స్టోరీ ‘కలల బేహారులు’ స్ఫూర్తిదాయకంగా ఉంది. విధిని ధిక్కరించి విజయాలు సాధించిన వారు మాలో ఉత్తేజం నింపారు. సమరానికైనా సంయమనానికైనా స్వభావ పరిశీలన, అవసరం అయితే స్వభావ సంస్కరణ తప్పవని ‘వినదగు’ ఆచరించదగు సందేశం బాగుంది. సూక్ష్మ చిత్రకళపై ఫొటోలు చూసి ఆనందించడం తప్ప మరేమీ తెలియని మాకు వివరణాత్మక వ్యాసం ఇచ్చినందుకు అభినందనలు.
-కె.ఎల్.ప్రసన్న (పేర్రాజుపేట)
విభిన్నం
నిన్నటి తరంకన్నా ఈ తరం యువత మిన్న. విభిన్నంగా ఉంటూ స్మార్ట్‌గా ఉంటున్నారు. కలలు కంటున్నారు. ఆ కలల్ని సాకారం చేసుకుంటున్నారు. విధిని ధిక్కరించి విజేతలవుతున్నారు - అంటూ కవర్‌స్టోరీలో కలల బేహారులు గురించి చక్కగా వివరించారు. నిజానికి చిత్రరంగానికి చెందినవారినే కలలు బేహారులనేవారు. కాని ఇప్పటి యువత చిత్రరంగంలోనే కాక అన్ని రంగాల్లోనూ విజృంభిస్తున్నది. ఈ వారం క్రైం కథలో క్రైం లేనే లేదు. అదొక దెయ్యం కథ. ఆ ఇంటి సేవకుడు మరణించినా యజమానురాలికి సాయం చేస్తూ ఆమెకు మంచి జరగాలని కోరుకునే మంచి దెయ్యం కథ.
-పి.చంద్ర (మాధవనగర్)
రెడ్‌లైట్
మంచి రోజు, మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఆగిపోయి మన మార్గంలో మనమే రెడ్‌లైట్ వేసుకుంటాం. కానీ అన్నీ గ్రీన్ లైట్లే అనుకొని సాగిపోతూ ఉండాలి. ఆగిపోకూడదన్న చక్కని సందేశం ఇచ్చారు ఓ చిన్న మాటలో. సెల్‌ఫోన్ల వాడకంపై ప్రశ్నకు ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్న మీ జవాబు నలేగా ఉంది. ‘పరమపద సోపానం’ కవితలో పేదవాడి చుట్టూ పాములే. పెద్దవాడి పక్కన నిచ్చెనలే అనడం బాగుంది గాని పేదవాడు భయపడకుండా నిచ్చెనవైపు సాగాలి. సాహసినే విజయం వరిస్తుంది కదా. మనసును పలుకరించే మధుర సంగీతం అంటూ అమృతవర్షిణిలో మధువులు చిలకరించారు.
-కె.సాహిత్యదీప్తి (రమణయ్యపేట)
కల్తీమయం
కాదేదీ కవిత కనర్హం లాగ నేడు కల్తీలేని పదార్థం కానరావడం లేదు. దీనికి కారణం - మనుషుల్లో ముఖ్యంగా వ్యాపారుల మనసులలోనే కల్తీ మనస్తత్వం ఏర్పడి, వారమ్మే వస్తువులలో చవక, విషపూరిత కెమికల్స్ కలిపి అక్రమ వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు మీద వ్యామోహంతో లాభాలు గడిస్తున్నారు. వీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తున్నారా? భార్యా పిల్లలతో కాపురం చేస్తున్నారా? అయితే ఈ కల్తీ వ్యాపారం వల్ల ఆ భగవంతుడు వీరికి ఎప్పుడో అప్పుడు తగిన గుణపాఠం చెప్పకపోడు. ఈ భయం లేకనే కల్తీ వ్యాపారం చేస్తున్నారు. మూట గట్టుకుంటున్న పాపం ఏదో ఒక రోజు బద్దలవక తప్పదు. కల్తీ వస్తువులమ్మి సొమ్ము చేసుకునే వ్యాపారులు హంతకులతో సమానం. చెప్పొచ్చేదేమిటంటే వీరు చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నా వీటన్నిటిని గమనిస్తున్న దేవుడి కన్నుగప్పి తప్పించుకోలేరు. తస్మాత్ జాగ్రత్త.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
సింగర్ ధోరణి
గోపాలంగారి రచయిత సింగర్ ఒక ధోరణిలో అందరి మధ్య ఒంటరిగా ఉండటం ఇష్టపడ్డాడు. కాని మనవాళ్లిప్పుడు రచయితలు కాకపోయినా వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ధర్మమా అని అందరి మధ్యా ఒక మిథ్యా ప్రపంచం సృష్టించుకొని ఒంటరిగానే ఉంటున్నారు. అతిథులున్న గదికి బట్లర్‌తోపాటు ఒక వృద్ధ జంట వచ్చి వారితో పేకాట ఆడి విశ్రాంతి కోసం పక్కగదికి వెళ్లడం, మర్నాడుదయం ఆ గదిలో ఎవరూ మసలిన జాడ కూడా లేకపోవడం, యజమానురాలు ఆ బట్లర్, వృద్ధ జంట ఎప్పుడో మరణించారని చెప్పడం అంతా అద్భుత కల్పనలా ఉన్నా ఇదొక నమ్మలేని నిజం.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
24 గంటలే
అందరికీ ఉన్నవి రోజుకి 24 గంటలే. అయినా రోజూ ఏదో చేయాలనుకుని చేయలేక అందుకు కుంటిసాకులు చెప్పుకుంటాం. ఉన్న వనరులతోనే గట్టిగా ప్రయత్నిస్తే మనమూ సాధించగలం అన్న సండే గీత బహు బాగుంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్మించిన ఫియర్‌లెస్ గర్ల్ కాంస్య విగ్రహం, మూన్ మ్యూజియం ఆర్ట్ విశేషాలు అలరించాయి. కల్తీల గురించి బెంగ సరే, అసలు మనకు ఆరోగ్య సూత్రాలపై శ్రద్ధ ఉందా? రోడ్‌సైడ్ ఒకే బకెట్ నీళ్లలో ముంచి తీసిన ప్లేట్లు, కప్పుల్లో పెట్టి ఇచ్చే టిఫిన్, టీ ఇంచక్కా మింగుతాం. ఫారిన్ లేబుల్‌తో వచ్చిన వారం రోజులు నిలవ చికెన్ వేపుడు ముక్కలు, పీజా, బర్గర్లు మింగేస్తాం. ముందు మనం ఆరోగ్య సూత్రాలు పాటించి అప్పుడు కల్తీ సంగతి.
-డి.శాంతి చంద్రిక (సామర్లకోట)
కలలు కనండి
కలలు కనండి కాని.. కథ - అందరాని వాటి కోసం అర్రులు చాస్తూ చేతికి అందిన అవకాశాన్ని జారవిడుచుకోవడం అవివేకం అని తెలియజెప్పింది. ఏ పనినీ కష్టమని కాకుండా ఇష్టంగా చేయడం ప్రారంభిస్తే జీవితంలో ఎదగడానికి మార్గం అవుతుంది.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)