తెలంగాణ

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 1:50 గంటలకు పూర్తి అయ్యింది. మహాగణపతి ఈ ఉదయం శోభాయాత్రగా బయలుదేరి ట్యాంక్‌బండ్‌ క్రేన్ నెంబర్ 5 వద్ద నిమజ్జనం అయ్యాడు. చివరి పూజ అనంతరం ఆద్యాత్మిక వాతావరణంలో మహాగణపయ్య గంగఒడికి చేరుకున్నాడు.వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహాగణపతి నిమజ్జనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ ట్యాంక్‌బండ్ పరిసరాలు మార్మోగాయి. ఇతర విగ్రహాలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు తొలిసారిగా మహాగణపతిని ముందుగానే నిమజ్జనం చేశారు.