శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పరిహారం కోసం వచ్చి ప్రాణం కోల్పోయిన మహిళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, డిసెంబర్ 11: వరద నష్టానికి ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కును బ్యాంకులో మార్చుకునేందుకు వచ్చి మల్లాపు బుజ్జమ్మ (62) అనే మహిళ మృతి చెందింది. చిట్టమూరు మండలం కొక్కుపాళెం గ్రామానికి చెందిన బుజ్జమ్మ ఇల్లు ఇటీవల సంభవించిన వరదలకు దెబ్బతింది. దీంతో ఆమెకు వరద నష్టం కింద ప్రభుత్వం 9వేల రూపాయలను మంజూరు చేసింది. ఆ నగదుకు సంబంధించి చెక్కును ఇవ్వడంతో దానిని మార్చుకునేందుకు శుక్రవారం కోట మండలం విద్యానగర్‌లోని స్టేట్‌బ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో చెక్కులు పొందిన లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉండటంతో క్యూలో సుమారు నాలుగు గంటలపాటు బుజ్జమ్మ నిలబడింది. అప్పటికి కూడా ఆమె కౌంటర్ వద్దకు వెళ్లలేకపోయింది. ఉదయం నుంచి అన్నపానీయాలు మాని క్యూలో నిలబడిన బుజ్జమ్మ ఒక్కసారిగా క్యూలోనే కుప్పకూలిపోయింది. దీంతో క్యూలో నిలబడివున్న వారు ఆమెను హుటాహుటిన ఆటోలో కోటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బుజ్జమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. వరద సహాయానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళను చూసి పలువురు దిగ్భ్రాంతి చెందారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేయడంతో గత మూడు రోజుల నుంచి స్టేట్‌బ్యాంకు బాధితులతో కిటకిటలాడుతుంది. పైమూడు మండలాల్లో స్టేట్, సిండికేట్, ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నప్పటికీ ఆ బ్యాంకులకు చెక్కులు ఇవ్వకుండా కేవలం విద్యానగర్‌లోని స్టేట్‌బ్యాంకుకే సుమారు 3 వేల చెక్కులు కేటాయించడం, ఆన్‌లైన్ వల్ల బ్యాంకులోని కంప్యూటర్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే బ్యాంకులో గంటల తరబడి వరద పరిహార చెక్కును మార్చుకునేందుకు నిలబడాల్సి వస్తుందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఏ మండలానికి ఆ మండలంలోని బ్యాంకులకు వరద పరిహారం చెక్కులను ఇచ్చివుంటే బుజ్జమ్మ ప్రాణాలు కోల్పోయి ఉండేది కాదని పలువురు వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు జారీచేసిప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకే బ్యాంకుకు పరిహారం చెక్కులు ఇవ్వడంతో బుజ్జమ్మ మృతిచెందిందని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలికి భర్త ఉన్నారు.