మెయిన్ ఫీచర్

నవ్వుల వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ఆకారాన్ని చూస్తే ఫక్కున నవ్వు వస్తోంది. ముఖం నిండా తెల్లటి మేకప్.. ముక్కుమీద ఎర్రటి వస్తువు.. నోటి చుట్టూ ఎర్రటి గీతలతో విచిత్రంగా ఉండే కౌన్స్ అందరూ ఒకచోట చేరితే ఎలా ఉంటుంది. ఇక అక్కడ నవ్వులే.. నవ్వులు కదా!. పసి పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకూ అందర్నీ నవ్వించే ఈ హాస్య విదూషకులందరికీ ఓ పెద్ద నెట్‌వర్క్ కూడా ఉంది. దీని పేరే ‘వరల్డ్ క్లౌన్స్ అసోసియేషన్. అమెరికాకు చెందిన ఈ అసోసియేషన్ సభ్యులను ఎపుడైనా.. ఎక్కడికైనా రమ్మంటే చాలు అమాంతం మన ముందు వాలిపోయి అందరి మోముల్లో నవ్వులు పూయించేస్తారు. ఇందులో ఓ చార్లీ చాప్లిన్, రోనాల్డ్ మెక్‌డొనాల్డ్ లాంటి హాస్య విదూషకలు దాగి ఉంటారు. ఇలాంటి హాస్య నటుల వేషాలు వేసుకుని మన ముందుకు వస్తే ఎవరికి మాత్రం నవ్వు రాకుండా ఉంటుంది.
ఇదే క్లౌనింగ్ ఆనందాల ప్రపంచం. దాదాపు 30 ఏళ్ల నుంచి విశ్వ వ్యాప్తంగా విస్తరించిన ఈ అద్భుతమైన ఆనందాల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ప్రతి పిల్లాడు ఆరాటపడుతుంటాడు. దాదాపు 52 దేశాలలో విస్తరించిన ‘వరల్డ్ క్లౌన్స్ అసోసియేషన్ (డబ్యూసీఏ)లో 25,000 మంది సభ్యులు ఉన్నారు. దీనికి ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సైతం ఉన్నారు. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడుగా రాండీ క్రిస్టనే్సన్ ఉన్నారు. ఉపాధ్యక్ష స్థానంలో మన దేశం తరపున ముంబయికి చెందిన మార్టిన్ డిసౌజా వ్యవహరిస్తున్నారు. ఈ అసోసియేషన్ ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశంలో అంతర్జాతీయ క్లౌన్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటుంది. వచ్చే ఏడాది బ్యాంకాక్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు ఆరంభించేసింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది.
ప్రొఫెషనల్ విదూషకులు
ఈ అసోసియేషన్‌లో ప్రొఫెషనల్ విదూషకులు ఉన్నారు. స్పార్కీ, మ్యాగీ, బెంజీ, టిమ్మిటో తదితర కళాకారులు ప్రేక్షకులతో మమేకమై కడుపుబ్బా నవ్వించేస్తారు. ఇందులో స్పార్కీ ఎక్కువగా పిల్లలతో కలిసిపోతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో నిష్ణానితులు. స్పార్కీ అనే ఈ కళాకారుడు స్కూళ్లు, ఆసుపత్రులలో ఏర్పాటుచేసే కార్యక్రమాలకు హాజరై అనారోగ్యం బారిన పడిన రోగుల్లో చికిత్స చేయించుకోవాలనే ఉత్సాహాన్ని తీసుకు వస్తాడు. ఇక సూళ్లలోనైతే స్పార్కీ చేసే ప్రదర్శనలకు పిల్లలు సైతం స్టేజీ ఎక్కేసి ఆయనతో పాటు ఆహుతులను అలరించేస్తారు. మ్యాగీ పిల్లల పుట్టిన రోజు వేడుకలకు హాజరవుతాడు. అలాగే బెంజీ థియేటర్‌లలో ఏర్పాటుచేసే కార్యక్రమాలకు హాజరవుతాడు. టిమ్మిటో సర్కస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన కళాకారుడు. మార్టిన్ గత 26 ఏళ్ల నుంచి ఇందులో సభ్యునిగా కొనసాగుతూ..పిల్లలకు గేమ్స్ నిర్వహించటానికి ఉబలాటపడుతుంటాడు.
హాస్య సుగంధాలు
ఇలా ప్రపంచమంతా క్లౌన్స్‌తో నింపేసేందుకు ఈ అసోసియేషన్ అనేక సర్ట్ఫికెట్ ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటచేయటంతో పాటు తరగతులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ హాస్య సుగంధాలను వెదజల్లుతోంది. ఈ కోర్సులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సైతం రూపొందించింది. అంతేకాదు వీడియోల ద్వారా క్లౌనింగ్ కోర్సును నేర్చుకోవచ్చు.
మన దేశంలో ఆదరణ లేదు
క్లౌనింగ్ కళకు మనదేశంలో ఆదరణ లేదనే చెప్పవచ్చు. ఎక్కడో సర్కస్‌ల్లోనే ఈ కళను ప్రదర్శించటం చూస్తుంటాం. ఎందుకంటే ఈ కళ మన సంస్కృతిలో ఓ భాగం కాదని భావించటం వల్లే అంత ఆదరణ లేకుండా పోయింది. ఈ కళతో కడుపుబ్బా నవ్వించటానికి ఈ కళాకారులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎవరైనా నేర్చుకోవాలని ప్రయత్నించినా తెలివి తక్కువ వేషం అని తీసిపారేస్తారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో ఈ కళకు ఎంతో ఆదరణ ఉంది. కాని మన దేశంలో స్కూలు మానేసిన విద్యార్థులే నేర్చుకుంటారనే అపోహ సైతం ప్రజల్లో ఉంది.
మరచిపోలేని అనుభవం:స్పార్కీ
అంతులేని ఆనందాన్ని అందిస్తూ.. హాస్యపు జల్లులు కురిపించే ఈ కళాకారులకు ఎదురయ్యే మధుర జ్ఞాపకాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలో ప్రదర్శన ఇస్తున్నపుడు స్పార్కీ షాపింగ్ వెళ్లాడు. మేకప్‌లో ఉన్నప్పటికీ అక్కడ కస్టమర్లు రెండవ చూపులోనే స్పార్కీని గుర్తుపట్టేశారు. అందులో ఓ మహిళ స్పార్కీని అభినందిస్తూ..‘ప్రేమలో విఫలమై.. పెద్ద కార్పోరేట్ జాబ్‌ను వదులుకుని పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన తాను ఇనే్నళ్లకు మనసారా నవ్వానంటూ అభినందనలతో ముంచెత్తింది. అలాగే చెన్నైలో ప్రదర్శన ఇస్తుండగా.. స్టేజ్‌పైకి ఓ గర్భిణీ వచ్చి ‘నా పొట్టలోని బిడ్డ ఇక ఆరోగ్యంగా బయటకు వస్తుంది. ఎన్నో ఏళ్ల తరువాత నవ్వాను అని ఆనందం వ్యక్తం చేసింది. మరి ఇలాంటి ఆనందాల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఉత్సాహం ఉంటే ఆలస్యం చేయకుండా చేరిపోండి.
*

వీరంతా వరల్డ్ క్లౌన్స్ అసోసియేషన్ సభ్యులు

వరల్డ్ క్లౌన్స్ అసోసియేషన్
అధ్యక్షుడు రాండీ క్రిస్టనే్సన్

క్లౌనింగ్ కళతో కాసుల వర్షం
అద్భుతమైన ఆనందాల ప్రపంచం