మెయిన్ ఫీచర్

ర్యాగింగ్ పై సమరభరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగే దీపంలా ఉండాలి. అప్పుడే నువ్వు ఇతర దీపాలను వెలిగించగలవు’ అన్నాడు మహా కవి రవీంద్రనాథ్ ఠాగూర్. క్రూరబుద్ధితో దీపం వెలిగించరు.. సరికాదా విరజిమ్ముతున్న కాంతిని అడ్డుకుంటున్నారు! కాదు.. కాదు.. పరోక్షంగా హత్య చేస్తున్నారు! ఒకచోట సంధ్యారాణి, మరోచోట ఉషారాణి, ఇంకోచోట మరొకరు.. ఇలా.. వేధింపుల వల్ల చనిపోవల్సిందేనా? ఏనే్నళ్ళు ఇలా?
కుంగుబాటు వద్దు
రణరంగంలో వెనక్కు అడుగు వేశామంటే అపజయమే. బతుకే ఒక పోరాటమని విద్యార్థినీవిద్యార్థులు తెలుసుకోవాలి. కని, పెంచిన తల్లిదండ్రుల, దేశం రుణం తీర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఎన్ని అవరోధాలు నెత్తినెక్కినా తొక్కేయాలి. అప్పుడే విజయలక్ష్మి వరిస్తుంది. గుండెల్లో ధైర్యం, మనస్సులో ఉత్తేజం నిండాలంటే మేధావులు జీవితచరిత్రలు తిరగేయాల్సిందే. ఇవన్నీ ఉత్తమ జీవితానికి స్ఫూర్తి మంత్రాలు. ‘మీ వ్యధలకు మీరే కారకులు.. మంచి చెడులను నిర్మించింది మీరే. మీ చేతులతో కళ్ళు మూసుకుని చీకటి అంటున్నది మీరే. కళ్ళ నుంచి చేతులు తీసి, వెలుగును చూడండి. మీరు స్వయంప్రకాశకులు. మీరు మొదటి నుంచీ పరిపూర్ణులే’ అని స్వామి వివేకానంద ఓ సందర్భంలో బోధించలేదా? నిజమే కదా!
తల్లిదండ్రుల పాత్ర
తల్లిదండ్రులనుంచి పిల్లలపై ఒత్తిడి పడుతుందన్న విషయం అధ్యయనాల్లో రుజువైంది. కానీ, అదే సమయంలో వారి మానసిక ఇబ్బందులను, ఆరోగ్య కష్టాలను పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఉషారాణి ముందుగానే తల్లిదండ్రులకు- కళాశాలలో, హాస్టల్‌లోని వేధింపుల సంగతిని చెప్పినా ఫలితం లేకపోయింది. ‘సర్దుకుపో’ అనకుండా అక్కడి పరిస్థితులపై ‘ఆరా’ తీసుంటే ఆమె మనందరి మధ్య ఉండేదేమోననిపిస్తోంది. చదువు, సంపాదన కంటే పిల్లలు ప్రధానమని ప్రతీ తల్లి, తండ్రి గ్రహించాలి. ఎన్ని పనులున్నా, పిల్లల భవిష్యత్, వారి బాగోగులు నిత్యం పరిశీలిస్తుండాలి.
సదస్సులు తప్పనిసరి
ఎదుగుతున్న పిల్లలకు ‘పుస్తకం-చదువు’ ఈ రెండింటి సంగతే కాదు.. మానసిక స్థైర్యం, కష్టాలు, నష్టాలు, ఆరోగ్యం వంటి వాటిపై నిత్యం కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు పోలీసు యంత్రాంగం, కళాశాల యాజమాన్యాలు ముందుకు రావాలి. నెలకొమారు ఒక్కొక్క అంశంపై నిష్ణాతులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి.
- గున్న కృష్ణమూర్తి

‘కీచక గురువులు’గా మారటం శోచనీయం
విద్య వ్యాపారమైపోయింది. మార్కులు, ర్యాం కులు, ప్రయోగ పరీక్షలు(ఇంటర్నల్స్ విధానం) వలన గురువుల వేధింపులు నిత్యకృత్యమైపోయాయి. ఈ నేపథ్యంలో సున్నిత మనస్కులైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిరంతర విద్యా పఠనం, వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిత్వ వికాశంలో ఉన్నతశ్రేణి బోధన, క్షేత్రస్థాయిలో ‘బోధన’ వంటివాటితో శిష్యులను ‘పరిపూర్ణులు’గా తీర్చిదిద్దే గురువులు ఆనాడు ఉండేవారు. చక్కని వ్యక్తిత్వాలను సంతరించుకున్నారు. గొంగళిపురుగు దశనుంచి సీతాకోకచిలుకగా విద్యార్థులను మార్చగల శక్తి గురువులదే. మరి అటువంటి ‘శక్తి’ కలిగిన గురువులు నేడు ఉన్నారా? ‘కీచక గురువులు’గా మకుటం తగిలించుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇది మారాలి... ఆ రోజు వస్తుంది...!
- భమిడిపాటి గౌరీశంకర్, రచయిత, విద్యావేత్త, నరసన్నపేట

ప్రొఫెసర్ కిరాతకం...
గుంటూరు సర్వజన వైద్యశాల పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడింది. విచారణ కమిటీ కూడా దీనిని నిర్ధారించింది. తల్లిసమానురాలైన గురువు ప్రొఫెసర్ లక్ష్మి నిత్యం వేధించడం వల్లనే సంధ్యారాణి అఘాయిత్యం చేసుకుందని తోటి విద్యార్థులు కమిటీ ముందు వెల్లడించడం ఆ ప్రొఫెసర్ నైజాన్ని స్పష్టం చేస్తోంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, దేశానికి ఆణిముత్యాల్లాంటి పౌరులను అందించాల్సిన ఆ ప్రొఫెసర్ కిరాతకంగా ప్రవర్తించడం న్యాయమా?
ఉషారాణి బలి!
పాతరేయబడిందనుకున్న ర్యాగింగ్ రోగం మళ్ళీ కోరలు సాచింది. ఇందుకు ఉషారాణి ఉదంతమే నిదర్శనం. అక్కడి లెక్చరర్ పైశాచిక ఆనందానికి ఆ కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి తోడవడంతో ఉషారాణికి రోజులు నిండిపోయా యి. పాఠాలు బోధించే ఆ లెక్చరర్‌కు విద్యార్థునుల ఫొటోలతో ఏం పని? తోటి విద్యార్థులు ఆ లెక్చరర్ పనిపట్టారా? అంటే అదీ లేదు. వారికి ర్యాగింగ్ రోగం పట్టుకుంది. ఇంకేముంది.. అంతా కలిసిపోయారు. ఓ విద్యార్థిని ఈ లోకం నుంచి పంపారు. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సంఘటనలు మెదలాడుతుంటాయి.

ఆధ్యాత్మిక, మేధావుల సూచనలు అవసరం
ప్రస్తుత విద్యావిధానం వ్యాపారం. మార్కులు, ర్యాంకులు, గ్రేడులు అనే నాలుగు శిథిల స్తంభాల నడుమ మూల్గుతున్నది. దీనికి ఆధునిక సాంకేతిక హంగులు అద్ది విద్యార్థుల ఆత్మహత్యల ఘోషను పట్టించుకునే గురువులు, తల్లిదండ్రులు ‘బంగారు భవిష్యత్’ కోసం బలిపశువులను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక, మేధావుల సలహాలు, సూచనలు, సహాయకారాలు తప్పనిసరిగా అవసరమే. ఆత్మహత్యలు చేసుకొనేటంతటి ఆలోచనలు కానీ, పరిస్థితులు కానీ వారికి ఎదురవలేదా? అంటే.. వారు అటువంటి వాటిని ‘అధిగమించేటంతటి’ చక్కని వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారని, తల్లిదండ్రులు, గురువులు, విద్యార్థులు అంగీకరిస్తున్నారనే కదా.. ఆచరిస్తున్నారనే కదా అర్థం. కనుక వర్తమానంలో ఆధ్యాత్మిక, మేధావుల ఆలోచనల పరంపర ‘విద్య’కు అవసరమనే చెప్పాలి.
- డాక్టర్ వి.సునీతారాణి, బయోటెక్నాలజీ విభాగాధిపతి,
గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్, శ్రీకాకుళం