మెయిన్ ఫీచర్

కొత్త ఆశలు... సరికొత్త ఆకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పొంగే ఉత్సాహంతో, అవధులు లేని ఆనందంతో అఖిల జగత్తు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గడిచిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకంగా జీవితాంతం నిలిచిపోయనట్లు, కొత్త సంవత్సరంలోనూ అలాంటి క్షణాలను ఆస్వాదించాలనే ఆకాంక్షతో, కొత్త ఆశలతో స్వాగతించేందుకు సన్నద్ధమైంది. పాత సంవత్సరపు చేదు, తీపి జ్ఞాపకాలను నెమరవేస్తూ.. సరికొత్త నిర్ణయాలతో విజయం వైపు పయనించాలని అడుగు ముందుకు
వేయబోతుంది.

ఆంగ్ల సంవత్సర ఆరంభ దినోత్సవాన్ని జనవరి 1ని జరుపుకోవటం ఆనవాయితీ. ఈ ప్రారంభ దినాన్ని కొత్త సంవత్సర వేడుకగా జరుపుకోవడంలో కొన్ని ప్రత్యేక విశిష్టతలు దాగి వున్నాయి. కొన్ని వేల ఏళ్ళ క్రితం బాబిలోన్ దేశంలో 11వ దినపు పండుగగా వసంతకాలపు మొదటి రోజున దీనిని జరుకునేవారు. సూర్యచంద్రుల చక్రభ్రమణం సంచారకాలంలో నూతన సంవత్సర ఆరంభ దినంగా వ్యవహరించడం ప్రతీతి.
గ్రెగోరియన్ జులియన్ కేలండర్‌ని అనుసరించి జాతీయ సెలవు దినోత్సవాన్ని పాటించేవారు. కొరియన్ కొత్త సంవత్సర దినోత్సవాన్ని ‘సియోలాల్’ పేరుతో తొలిరోజు ‘లునార్-కేలండర్’గా ప్రస్తుతిస్తారు. క్రీస్తు పూర్వానికి ముందు రోమ్‌ని అనుసరించి ‘జానుశ్‌కి’ అంకితమై వినూత్న ఆలోచనల సృష్టికి, సరికొత్త సృజనాత్మక ప్రయత్నాలకు ఆలవాలంగా ఈ రోజుని అభివర్ణిస్తారు.
రోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా
అర్ధరాత్రి ఆరంభమయ్యే నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాం తాలు వేదికగా మారుతుంటాయి. కుటుంబ వాతావరణంతోపాటు, ఇంటా, బయటా ఈ ఉత్సవాలను అట్టహాసంగా జరుపుకుంటారు. విరజిమ్మే విద్యుత్ కాంతుల నడుమ ఆటపాటలతో, నృత్యాలు చేస్తూ యువత ఉత్సాహం ఉరకలే స్తోంది. పాత ఏడాదికి వీడ్కోలిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంలో కోటి ఆశల కోర్కెలు ప్రతిఫలిస్తుంటాయి. భవిష్యత్ సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికా బద్ధంగా అడుగు ముందుకు వేసేందుకు సర్వత్రా వ్యూహరచన చేస్తారు. జీవితంలో ఎదగడానికి క్రియాశీలకమైన కొన్ని పరిష్కార మార్గాలతోపాటు, నిర్దేశిత లక్ష్యాలను ఈ సందర్భంగా రూపొందించుకుంటారు. సముచిత రీతిలో ఆదర్శవంతమైన కొత్త నిర్ణయాల రూపకల్పనకు దీనిని సరైన తరుణంగా భావిస్తారు.
దురలవాట్లకు దూరంగా మసలాలని బాస చేసుకుం టారు. పరస్పరం ఒకరినొకరు అభినందించుకుంటూ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగాగడుపుతారు. అదృష్టాల్ని, విజయావకాశాల్ని పంచిచ్చే సంతోషపు ఘడియలుగా ప్రజలు ఈ ఆనందహేళను సంబరంగా జరుపుకుంటారు. ఇం దులో భిన్న సంస్కృతులు, సాంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. రకరకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేసి అతిథులకి కనువిందు చేస్తారు. ఈ సందడిని చూస్తే- భిన్నత్వంలోని ఏకత్వంతోపాటు జాతీయ సమగ్రత కొట్టొచ్చినట్టు అగుపిస్తుంది.
ఈ సందర్భంగా గ్రీటింగ్ కార్డులు, పుష్పగుచ్ఛాలు చేతబట్టి ఆత్మీయులకి, మిత్రులకి, బంధువర్గాలకి శుభాకాంక్షలు తెలియజెపుతారు. ప్రస్తుత కాలమాన విషయానికొస్తే- సెల్‌ఫోన్ మెసేజీలతో, వాట్సప్- ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈమెయిల్‌లతో క్లుప్తమైన అభినందన సందేశాలు గుప్పిస్తున్నారు. తొలినాళ్ళలో ప్రకృతి, భూభ్రమణాలకు సంబంధించిన నియమాల ప్రకారం క్రీస్తు సాంప్రదాయ పద్ధతులతో రోమన్ కేథలిక్‌లు తరచుగా నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా ఆచరించి అమలుజరిపేవారు. ప్రస్తుతం మతాలకతీతంగా జరుపుకోవటం పరిపాటయింది.
వర్తమానంలో జీవిస్తూ.. భవిష్యత్తుకు పునాదులు వేసుకునేందుకు ఆశా వాహ దృక్పథంతో ముందుకు సాగాలనే అంతర్లీన భావన ఈ నూతన సంవ త్సర వేడుకల్లో ప్రస్ఫుటమవుతోంది. సానుకూల దృక్పథంతో విప్లవాత్మకమైన మార్పుల్ని చేతల్లో ప్రదర్శించడానికి ప్రతి ఒక్కరూ ప్రతినబూనుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఉవ్విళ్లూరివారు కోకొల్లలు.
కొంతమంది ఈ శుభదినాన కొత్త ప్రయత్నాలకు నాందీ పలుకుతారు. ప్రజల మనోభావాల్లో చైతన్యవంతమైన పాత్రను పోషించడంలో కొత్త ఏడాది ఇచ్చే ఉత్సాహ స్ఫూర్తి గణనీయమైనది. ఈ తపనను మాట ల్లో, చేతల్లో వ్యక్తం చెయ్యడానికి ఏడాదికోసారి ఇలాంటి ఉత్సవ వేడుక సౌరభం ప్రజల జీవితాల్లోకి వచ్చి తీరాల్సిందే! కాబట్టే ఆంగ్ల సంవత్సరాదికి దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. మన తెలుగువాళ్ళకి మాత్రం కొత్త సంవత్సర వేడుక ‘ఉగాది’ తోనే ప్రారంభవౌతుంది. ఇలా మానవ జీవితాల్లో కొత్త మార్పులతో పాటు అనేక మలుపులు తిప్పగల నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఏటా అట్ట హాసంగా జరుపు కుంటారు. ఈ స్ఫూర్తితో ఆదర్శవంతమైన మరికొన్ని సత్కార్యాలను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని ఆశిస్తూ ఆకాంక్షిద్దాం!

- బులుసు సరోజినీదేవి, 9866190548