మెయిన్ ఫీచర్

ఖైదీలే కళాకారులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరడుగట్టిన నేరస్థులకు కళాప్రదర్శనల్లో శిక్షణ
పరివర్తన తెస్తున్న ప్రముఖ కళాకారిణి అలకానంద రాయ్

36 ఏళ్ల వయసులో వైధవ్యం ప్రాప్తించినా విధిరాతకు చింతించలేదు అలకానంద రాయ్. తాను ప్రాణపందంగా భావించే నాట్యంతో నేరస్థుల్లో మానసికంగా మార్పు తీసుకువస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహిళా ఖైదీలతో పాటు ఉండే పిల్లల చదువుకోసం ఫండ్స్ సేకరిస్తూ వారికి తల్లయ్యారు.

నాట్యం సకల ప్రాణులను రంజింపజేసే అద్భుత కళ. ఆ కళను సార్థకం చేసుకుంటున్నారు అలకానంద రాయ్. జైలులో ఉండే ఖైదీల వద్దకు వెళ్లాలంటే ఏవరైనా భయపడతారు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారోతెలియదు. అలాంటి కరుడుగట్టిన నేరుస్థుల మధ్యకు వెళ్లింది ఈ ప్రముఖ నాట్య కళాకారిణి. అప్పటికే నాట్యశాస్త్రంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ప్రముఖ కళాకారిణి. అలాంటి ఆమె తన కళను సార్థకం చేసుకునేందుకు ఖైదీలను ఎం చుకుంది. వారికి నాట్యంలో శిక్షణ ఇస్తూ మనుషులుగా తీర్చిదిద్దుతున్నారు అలకానంద రాయ్. ఖైదీలే కళాకారులుగా మారి ఇప్పటి వరకు 145 ప్రదర్శనలు ఇచ్చారు.
కోల్‌కతా జైలును ఎంచుకున్నారు
జైలుకు వచ్చిన వారంతా కావాలని నేరం చేసిన వాళ్లు కాదు. క్షణికావేశంలో నేరం చేసినవారు కొందరైతే.. చేయని తప్పుకు శిక్ష అనుభవించేవారు మరికొందరు ఉంటారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో బాధ. వారి బాధలు వింటుంటే ఆమె మనసు చివుక్కుమనేది. కారణం ఎదైతేనేమి జైలు గోడల మధ్య నలిగిపోతున్న వారి మానసిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలంటే ఆమెకు తెలిసిన విద్య నాట్యం. అప్పటికే అలకానంద రాయ్ ప్రముఖ నర్తకి. కళతో సామాజిక, మానసిక మార్పు తీసుకురావాలని అభిలషించిన ఆమె తన కళాకారులుగా ఖైదీలను ఎన్నుకున్నారు. వారికి శాస్ర్తియ కళలో శిక్షణ ఇస్తే సహజంగానే మానసిక ప్రవృత్తిలో మార్పు తీసుకురావచ్చని భావించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలును ఎంచుకున్నారు. ఐజీ బి.డి.శర్మ అనుమతితో తొలుత ఖైదీలతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో పాల్గొన్న మగ ఖైదీలు స్ర్తి నృత్యరూపాలు నేర్చుకోవటానికి అయిష్టత కనబరిచారు.
కలరియపట్టుతో ఆరంభం..
తొలుత ఖైదీలకు కలరియపట్టు కళను నేర్పించారు. ఈ ప్రాచీన కత్తియుద్ధ కళను నేర్చుకోవటానికి ఖైదీలందరూ రావటం ప్రారంభించారు. ఇందులో శిక్షణ ఇచ్చిన తరువాత ఫోక్ డ్యాన్స్ నేర్పించారు. ఈ రెండింటిలో శిక్షణ తీసుకున్న ఖైదీలతో తొలి ప్రదర్శన ఏర్పాటుచేశారు. కొద్దిమంది ఆహుతులు మధ్య ఖైదీలు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకోవటంతో ఉదయ్ శంకర్ డ్యాన్స్ ఫెస్టివల్‌లో బహిరంగ ప్రదర్శన ఇప్పించారు. ఖైదీల ఇచ్చిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. కళా ప్రదర్శనల్లో ప్రొఫెషనల్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఖైదీలు ఇస్తున్న ప్రదర్శనలు విపరీతంగా ఆకట్టుకోవటంతో వారికి మరిన్ని అవకాశాలు వచ్చా యి. జనం మధ్య వాల్మీకి డ్యాన్స్ డ్రామా ప్రదర్శన ఇప్పించారు. నిజానికి ఈ ఖైదీలంతా తనకు వాల్మీకులే అని అంటారు అలకానంద.
ఆటోగ్రాఫ్ తీసుకునే స్థాయికి ఎదిగారు
కలరియపట్టుతో ఆరంభమైన ఖైదీల కళాప్రదర్శనలతో వారిని కళాకారులుగా తమను తాము తీర్చిదిద్దుకునే స్థాయికి ఎదిగారు. అంతేకాదు నేడు వారు ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా వారి ఆటోగ్రాఫ్‌ల కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. జన జీవన స్రవంతికి దూరమైన ఖైదీలు నేడు ఆటోగ్రఫీలు ఇచ్చే స్థాయికి ఎదిగారంటే జీవితంలో వారు మరింకెప్పుడు నేరం చేయరని అలకానంద అంటారు. ఖైదీలకు శిక్షణ ఇచ్చేటపుడు అనేకమంది భయపెట్టినా ఆమె వెరవలేదు. ఇపుడు వారంతా నా బిడ్డలే అని అంటారు. ఈరోజు ఈ ఖైదీలు పెరోల్ మీద బయటకు వచ్చి ఆమెతో షాపింగ్, సైట్‌సీయింగ్‌కు వెళతారు. అలాగే ముంబయి లో రెండుసార్లు, ఢిల్లీలో మూడుసార్లు, బెంగళూరు, పూణె, భువనేశ్వర్ వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తుంటారు. అవకాశం దొరికింది కదా అని వారు ఏనాడు తప్పించుకోవాలని అనుకోరు. ఆమె ఏమి చెబితే దాన్ని చిత్తశుద్ధితో చేస్తారు. ఆమె నమ్మకాన్ని ఇప్పటి వరకు ఒమ్ముచేయలేదు.
జన జీవనంలో సులువుగా కలవలేకపోవచ్చు..
జైలుకు వచ్చిన ఖైదీ జన జీవన స్రవంతిలోకి తిరిగి రావటం అంత సులువు కాకపోవచ్చు. కాని కళా ప్రదర్శనలతో వారిని మనుషులుగా తీర్చిదద్దటం తన అదృష్టంగా అలకానంద భావిస్తారు. ఏ బిడ్డ కూడా పుట్టుకతోనే ఖైదీగా మారడు. పరిస్థితుల ప్రభావం వల్ల వారు నేరాలకు పాల్పడుతున్నారు. వీరిలో డ్రైవర్లు ఉన్నారు. రైల్వే టీటీలు ఉన్నారు. కొంతమంది వ్యాపారం చేసేవారు ఉన్నారు. కాని వీరంతా మళ్లీ నేరప్రవృత్తికి పాల్పడరని ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు. కళా ప్రదర్శనలతో ప్రజలకు చేరువై మంచి నడవడికతో మార్పును ఆస్వాదిస్తున్నారు.