మెయిన్ ఫీచర్

దేవతల లోకంలో అందమైన మజిలీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్‌లో అద్భుత గ్రామం * మన్నికైన ఉన్నితో మేలురకం వస్త్రాల తయారీ
మాజీ సైంటిస్ట్ మార్గదర్శకత్వంలో ముందడుగు

పచ్చటి లోయలు.. చేతికి అందేంత ఎత్తులో కదిలే మేఘాలు..
స్వచ్ఛమైన గాలి.. తియ్యటి నీరు.. కనుచూపుమేరలో కనిపించే హిమాలయ అందాలు.. స్వర్గాన్ని తలపిస్తాయి. వీటన్నింటిని చూస్తే ఎవరికైనా అరుదైన అనుభూతి
కలుగుతుంది. ఎవరికైనా అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది.
దేవతల లోకంగా పిలుచుకునే ప్రకృతి రమణీయతకు నెలవైన
ఉత్తరాఖండ్‌లోని మసరానా అనే ఓ చిన్న గిరిజన గ్రామంలోకి వెళితే అక్కడ ఓ వృద్ధ జంట నివశించే ఇంటిలోకి అడుగుపెట్టకుండా బయటకు రాలేరు. ఆ లోగిలిలో
కొలువైన కుటీరపరిశ్రమలో
ప్రపంచ ప్రసిద్ధిచెందిన
శాలువాలు దర్శనమిస్తాయి. సహజసిద్ధమైన రంగుల్లో స్థానికంగా దొరికే ఉన్నితో అక్కడ నేతపనివారు నేసిన శాలువాలను కొనుగోలు చేయకుండా ఏ ఒక్కరూ కూడా
వెళ్లలేరు.

ఎక్కడో ఢిల్లీలో సౌకర్యవంతమైన జీవితాన్ని వెళ్లదీయాల్సిన వయసులో ఉత్తరాఖండ్‌లోని ఈ పర్వతశ్రేణుల్లో అద్భుతమైన ఈ చేతివృత్తి కళకు జీవం పోస్తున్న డాక్టర్ గయూర్ అలామ్, ఆయన భార్య పాట్రిసియా ఉన్నతోద్యోగాల్లో పనిచేసినవారే. డాక్టర్ అలామ్ ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థలో ఆర్థికశాస్త్ర పరిశోధకుడిగా పనిచేయగా.. ఆయన భార్య పాట్రిసియా బ్రిటీష్ స్కూలులో టీచర్‌గా పనిచేశారు. పదవీ విరమణ తరువాత తమ శేష జీవితాన్ని ఈ వేద భూమిలో గడిపేందుకు ఇక్కడకు వచ్చారు. కొండలపై రమ్యమైన చిన్న ఇల్లును నిర్మించుకున్నారు.
స్థానికులకు ఉపాధి
ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న ఆలామ్ ఇక్కడ నేతపనివారు ఎక్కువగా ఉండటం గమనించి వారికి ఉపాధి, తమకు వ్యాపకం కల్పించుకునేందుకు ఈ శాలువ తయారీ కుటీర పరిశ్రమను స్థాపించారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఈ కుటీర పరిశ్రమను స్థాపించారు. ఐదుగురు నేత పనివారు పనిచేస్తుంటారు.
సహజసిద్ధమైన రంగులు
శాలువాలకు ఉపయోగించే రంగులు సహజసిద్ధమైనవి. వీటిని చెట్ల వేర్లు, కాండం, పువ్వల నుంచి తయారుచేస్తారు. ఆయుర్వేద దుకాణంలో వీటిని కొనుగోలు చేసి రంగులుగా తయారుచేసి ఆ రంగులను జార్లలో నిల్వచేస్తారు. వాషింగ్ మెషిన్లు, డ్రమ్ములను ఉపయోగించి శాలువ క్లాత్‌ను ఆరబెడతారు. ఎందుకంటే ఇక్కడ నాలుగు నెలల పాటు నేల తేమగా ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో ప్రకృతి దృశ్యాలను చూడటానికి వచ్చే యాత్రీకులు తప్పకుండా ఈ కుటీర పరిశ్రమను సందర్శించి తమకు కావల్సిన శాలువాలను కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినా..అక్కడకు తీసుకువెళ్లి అమ్ముతుంటారు. డెహ్రాడూన్‌లో మరో దుకాణాన్ని ఏర్పాటుచేసి అక్కడ కూడా అమ్ముతుంటారు. ఈ శాలువాలను సమీప గ్రామాల్లో మగ్గాలపై నేస్తారు. వాటిని వీవర్స్ వద్ద నుంచి కొనుగోలు చేసి సేంద్రియ రంగులతో అద్దకం వేసి అమ్ముతారు.
రెండు కిలోల ఉన్నితో
ఐదు మఫ్లర్లు
వీవర్లకు రెండు కిలోల ఉన్ని ఇస్తే ఐదు మఫ్లర్లు తయారు చేస్తారు. డాక్టర్ అలమ్ ఇక్కడ కుటీర పరిశ్రమను స్థాపించేటప్పడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ విడిపోయాయి. వీవర్స్‌కు తక్కువ వేతనాలు వస్తుండేవి. అటువంటి సమయంలో ఈ దంపతులు ఇక్కడకు వచ్చి నేతపనివారికి పని కల్పించటమే కాదు వారి పనికి తగ్గట్లు వేతనాలు ఇవ్వటం ప్రారంభించారు. ఒక్కొక్క కార్మికుడు వారానికి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు సంపాదిస్తుంటారు. మార్కెట్లో ఉన్న రేట్ల కంటే ముప్పయి శాతం ఎక్కువగానే వేతనాలు వస్తుంటాయి.
ఊహించని మార్పు..
అలమ్ దంపతులు ఎన్నో సందేహల నడుమ ఈ కుటీర పరిశ్రమను ఏర్పాటుచేశారు. శాలువాలను కొనుగోలు చేస్తారా? అనే సందేహం ఉండేది. కాని ఆరు నెలల్లోనే వారి భయాలను పటాపంచలు చేస్తూ వ్యాపారం సజావుగా సాగటం ప్రారంభించింది. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తులు ఆదరణ కోల్పోతున్నాయనే భయం వెన్నాడేది. కాని ఇక్కడ నేతపనివారి ఉత్పత్తులు మన్నికతో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నారు. అంతేకాదు ఇరవై ఏళ్ల క్రితం ప్రజల్లో చేతిల్లో డబ్బు ఉండేది కాదు. కాని నేడు ఉంటుంది. దీంతో సహజ ఉత్పత్తుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ఈ ఆర్థికవేత్త అభిప్రాయం. ముస్సోరి మాల్‌లో మూడు వందలకే శాలువా దొరుకుతుంటే ఇక్కడ రెండు వేల రూపాయలు పెట్టి ఎందుకు కొనుగోలు చేయాలి అనే అడిగే యాత్రికులు ఉన్నారు. వీరిందరికీ పాట్రిసియా సమాధానం ఒక్కటే ‘‘మీరు మురికివాడల్లో సైతం చిప్స్,కోక్, మ్యాగీలను అమ్మవచ్చు కాని క్రాఫ్ట్ వస్తువులను మాత్రం అమ్మలేరు అని అంటారు. ఒకప్పుడు ఇక్కడ కొండలు ఎక్కేటపుడు, దిగేటపుడు చేతి కర్ర తప్పనిసరి. అలాంటి కర్రలు సైతం ప్లాస్టిక్‌లో వస్తుండటం వల్ల ఇక్కడి ప్రకృతికి పెనుముప్పే. ఇలాంటి చోట సహజమైన ప్రకృతి వనరులతో ఏర్పాటైన ఈ కుటీర పరిశ్రమను పాట్రిసియా వంటి విదేశీవనిత నిర్వహించటం విశేషం.

-హరిచందన