సబ్ ఫీచర్

జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శునకాలవల్ల అంతరిస్తున్న సకశేరుకాలు
11 జీవ జాతులకు వీటితో ముప్పు
తాజా అధ్యయనంలో వెల్లడి

విశ్వాసానికి ప్రతిరూపంగా చెప్పుకునే జీవి శునకం. సాధారణ పౌరుల దృష్టిలో ఇది నిజమే. కానీ అంతర్జాతీయ పరిశోధకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. శునకాల వల్ల 11 జాతుల జీవుల మనుగడ ప్రమాదంలో పడిందని, భవిష్యత్‌లో ఆయా జాతులు అంతరించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా అధ్యయనాల్లో అది తేలిందని వారు అంటున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్జ్ ఇన్ ఎకోలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ఎటిఆర్‌ఇఇఇ)కి చెందిన శాస్తవ్రేత్తలు డాక్టర్ అబి వనక్, చంద్రిమాహోమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి శాస్తవ్రేత్తలు ఈ విషయంలో అధ్యయనం చేసి వివరాలు వెల్లడించారు. సకశేరుకాల అంతరించిపోవడంపై (వెన్నుముక గల జీవులు) పెంపుడు శునకాల ప్రభావం, ప్రపంచ పరిణామాలు అన్న అంశంపై ఈ పరిశోధన సాగింది. ప్రపంచవ్యాప్తంగా 188 జీవజాతులకు వీటితో ముప్పు ఉందని ఆ పరిశోధన తేల్చింది. 96 రకాల క్షీరదాలు, 78 రకాల పక్షులు, మూడు రకాల ఉభయచరాలు, 22 రకాల సరీసృపాలకు వీటితో ముప్పు ఉందని తేల్చారు. వీటిలో 30 అంతరించిపోయే దశకు చేరుకున్నాయని, వాటిలో రెండు మరీ ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంలో క్షీరదాలు అంతరించిపోవడానికి ఎలుక, పిల్లి జాతి జంతువుల తరువాత ఎక్కువ ముప్పు శునకాలతోనేనని వారి అధ్యయనం తేల్చింది. శునకాల హైబ్రిడైజేషన్, రేబిస్ వంటి రోగాల వ్యాప్తి, అటవీ జంతువులతో మమేకం కావడం వంటి పరిణామాలవల్ల జీవవైవిధ్యంపై దుష్ప్రభావం పడుతోందని తేలింది. ముఖ్యంగా ఆసియాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తేల్చారు. నిజానికి హిమాలయాలవంటి ప్రాంతాలలో తిరిగే మంచుపులులు, తోడేళ్లవల్ల అంతరిస్తున్న మొత్తం పశుసంపదకన్నా శునకాల వల్ల నశిస్తున్న పశుసంపద ఎక్కువని, ఇదే పరిస్థితి కొనసాగితే గొర్రెలు, మేకల మందలను సాకడం ఆయా ప్రాంతాలవారికి సాధ్యం కాకపోవచ్చని చంద్రిమా అభిప్రాయపడుతున్నారు. గత ఐదేళ్లలో పశుసంపద, ముఖ్యంగా గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని వారు చెబుతున్నారు. జంతువుల సంరక్షణ, మానవుల ఆరోగ్యంపై వ్యూహాత్మక, సమర్ధవంతమైన ప్రచారం అవసరమని, దీనివల్ల శునకాల వల్ల హాని జరగకుండా చూడటం సాధ్యమవుతుందని వారు సూచిస్తున్నారు. శునకాలను పెంచుకునేవారు బాధ్యతాయుతంగా, రక్షణాత్మక విధానాలను అనుసరిస్తే పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మేలుచేసినవారవుతారని వారు అంటున్నారు. శునకాలు, మనుషుల నిష్పత్తి పెరిగేకొద్దీ జీవవైవిధ్యానికి ముప్పు పెరుగుతుందని వారి విశ్వాసం. వచ్చే దశాబ్దాల్లో ఈ పరిణామాలు సంభవిస్తాయని వారు అంచనావేస్తున్నారు. ఆహారవ్యర్థాలను విచ్చలవిడిగా పారబోయడం వల్ల వీధికుక్కల బెడద పెరుగుతోందని, స్టెరిలైజేషన్ వల్ల మాత్రమే వాటి సంఖ్యను నియంత్రించడం సాధ్యంకాదని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో జీవజాతుల మనుగడకు బెడద ఏర్పడితే సమాజంపై అది పెను ప్రభావమే చూపిస్తుంది.