మెయిన్ ఫీచర్

తెలుగు వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిబ్రిటన్ పార్లమెంట్‌లో ఏడుసార్లు నాట్యప్రదర్శన
జితాళపత్ర గ్రంథానికి తెలుగు అనువాదం
జిరాణిస్తున్న హైదరాబాద్ నృత్యకారిణి రాగసుధ

నాట్యం ఆమె ఊపిరి. అది ఆమె గుండె సవ్వడి. భరతనాట్యం ఆమె ప్రాణం. ఏదైనా కళలో ప్రావీణ్యం ఉంటే కనిపించే ఆత్మవిశ్వాసమే ఆమెలోనూ ఉంది. అందుకే ఖండాంతరాల్లో తన ఖ్యాతిని చాటుకుంటోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో ఇప్పటివరకు ఏడుసార్లు నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ రికార్డు నమోదు చేసుకుంది వింజమూరి రాగసుధ. దశాబ్దకాలానికి పైగా తెలుగునాట్య సౌరభాలను లండన్‌లో వెదజల్లుతున్న రాగసుధ ఒక్క నాట్యంలోనే కాదు తెలుగుభాషకు సైతం లండన్ గ్రంథాలయాల్లో సొగసులు అద్దారు. లండన్ లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి తెలుగుకీర్తిని చాటిన వింజమూరి రాగసుధ హైదరాబాద్‌కు చెందిన నృత్య కళాకారిణి.
ఎనిమిదేళ్లనుంచే శిక్షణ
వింజమూరి రాగసుధ నృత్యంలో తొలి అడుగు హైదరాబాద్‌లోనే వేశారు. డబుల్ పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. ఎనిమిదేళ్ల నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. డాక్టర్ ఉమా రామారావు వద్ద శిక్షణ తీసుకున్న రాగసుధ ఫోక్ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యం సాధించారు. వివిధ దేశాల్లో జరిగే వేడుకల్లో భారతీయ జానపద శైలిలో కోయ, లంబాడి నృత్యాలను ప్రదర్శించారు. జానపద కళలను తొలిసారి బ్రిటన్‌లోని నెహ్రు సెంటర్ ఆఫ్ హైకమిషనర్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. ఆమె ప్రదర్శించిన శాస్ర్తియ నృత్య కళారూపాలలో ఆయుర్వేదం, మ్యూజిక్ థెరపీ, నారీ శక్తి వంటివి ప్రధాన అంశాలుగా ఉంటాయి.
రచయిత్రిగానూ రాణింపు
రాగసుధ తండ్రి నిరంతరం పుస్తకాలు చదివేవారు. ఈ పుస్తకాలు చదవటం అనే అలవాటు ఆయన వద్ద నుంచే చిన్నప్పటి నుంచి అలవడిందని ఆమె చెబుతారు. పసితనం నుంచే చాలామందికి ఎన్నో అలవాట్లు అలవడతాయి. వాటిని కొనసాగించేవారు కొందరే. అలాంటివారిలో రాగసుధ ఒకరు. చిన్నప్పటి నుంచి తెలుగు పుస్తకాలు చదవటం ఇష్టంగా మార్చుకున్నారు. మయన్మార్, బ్రిటన్ దేశాలకు వలస వెళ్లిన తెలుగు ప్రజలకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను ఆమె అధ్యయనం చేశారు.
ఆ అలవాటుతోనే అనువాదం
పుస్తకాలు చదవటంలో ఏర్పడిన అభిలాషే ఆమెను బ్రిటన్‌లోని ఓ లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించింది. 2004లో బ్రిటన్ వెళ్లిన రాగ సుధ అక్కడ లైబ్రరీలో తెలుగు పుస్తకాల దుమ్ము దులిపారు. వాటిని అక్కడ అందరూ చదివేలా చేశారు. అక్కడి యూనివర్శిటీల్లో తెలుగు భాషను బోధించేందుకు ఆమె తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.
బహుముఖ నైపుణ్యం
బ్రిటన్‌కు రాకముందు ఇండియా ట్రావెల్ టూరిజంలో పనిచేశారు. ఈ సందర్భంగా విమానయాన సిబ్బందికి ఆమె నృత్యంలో శిక్షణ ఇచ్చారు. 2004లో లండన్ వెళ్లిన ఆమెప్రస్తుతం సుందరలాండ్ యూనివర్శిటీలో భరతనాట్యాన్ని బోధిస్తున్నారు. అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సొంతం చేసుకున్న రాగసుధ బహుముఖ నైపుణ్యం తో అనేక అడ్డంకులను అధిగమిం చి లండన్‌లో శాస్ర్తియ నృత్యాన్ని బోధిస్తున్నారు. ఆమెలో ఓ జర్నలిస్ట్, రచయిత్రి ఉన్నారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో దాదాపు 200 వందలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా కనీసం 25వేల మంది ప్రేక్షకులు హాజరవ్వటం ఆమెకు ఉన్న ఆదరణకు అద్దంపడుతుంది. ప్రస్తుతం కనీసం 20 నుంచి 25 మంది పిల్లలకు నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఒకవైపు యూనివర్శిటీలో పనిచేస్తూనే మరోవైపు జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో వివిధ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసే వేడుకలలో ఆమె ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇస్తా రు. ప్రపంచంలోనే గొప్పదయిన భారతీయ సంస్కృతికి సెంటర్‌ను ఏర్పాటు చేసి యువతీ యువకులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బోధిస్తున్నారు. రెం డేళ్ల క్రితం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిట న్ సందర్శించినపుడు ఆయనకు స్వాగ తం పలికినవారిలో రాగసుధ కూడా ఉన్నా రు. ఆమె నడుపుతున్న సంస్కృతి కేంద్రం వల్లనే ఆమె కు ఆఈ ఆహ్వా నం లభించింది.
ఆమె కలం నుంచి వెలువడిన కవితలు, వ్యాసాలతో పుస్తకాలు సైతం ప్రచురించారు. 1840 నుంచి బ్రిటన్‌లో ‘తెలుగు, మరాఠీ భాష లు వాడుక’ అనే అంశంపై అనే పరిశోధనలు కూడా చేశారు.
వరించిన అవార్డులు
భార్యగా.. ఓ బిడ్డకు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే లండన్‌లో విభిన్న రంగాల్లో రాణిస్తూ అక్కడి ప్రతి భారతీయుడు గర్వపడేలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని తెలుగు అసోసియేషన్ ‘నృత్య నగజ’ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. ఇటీవలనే ఆర్డ్ అండ్ కల్చర్ విభాగంలో ‘ఆసియా మహిళా అచీవర్ అవార్డు’ను సొంతం చేసుకున్నారు. అలాగే 2016లో ప్రవాస స్ర్తి శక్తి అవార్డును పొందారు. ఇలా ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్న రాగసుధ బ్రిటన్ పార్లమెంట్‌లో వివిధ సందర్భాల్లో ఏడుసార్లు నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. భరతనాట్యం, రచన, విద్య వంటి విభిన్న అంశా ల్లో తన ప్రతిభను చాటుతున్న రాగసుధ బ్రిటన్ రాచరిక కిరీటంలో భారతీయ కోహినూర్ వజ్రం వంటివారు అని ప్రశంసిస్తారు.

టి.ఆశాలత